Begin typing your search above and press return to search.

మా ప్రత్యర్థులకు జగన్‌ డబ్బులిస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   4 Nov 2022 2:30 PM GMT
మా ప్రత్యర్థులకు జగన్‌ డబ్బులిస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
X
జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల ^è ంటిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో తమకు వ్యతిరేకంగా పనిచేసినవారికి కూడా ముఖ్యమంత్రి జగన్‌ సంక్షేమ పథకాల పేరుతో డబ్బులేస్తున్నారని చెప్పారు. ఇందుకు సీఎం జగన్‌పైన కోపం ఉందన్నారు. కార్యకర్తలు సైతం ఎవరిపైన అయితే తాము పోరాటం చేశామో.. వారికి కూడా సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారని చంటిబాబు హాట్‌కామెంట్స్‌ చేశారు.

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నవంబర్‌ 4న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్‌ గత ఎన్నికల్లో తమకు ఓట్లేయని వారికి, తమపై పోరాటం చేసినవారికి కూడా సంక్షేమ పథకాల కింద డబ్బులు జమ చేస్తున్నారని చెప్పారు. దీనిపై తమకు అభ్యంతరాలున్నాయన్నారు. అయితే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంగా భాగంగా ప్రజల వద్దకు వెళ్తున్న తమకు హారతులు ఇచ్చి ప్రజలు స్వాగతం పలుకుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అప్పడు తమకు తెలిసిందని.. జగన్‌ ఎంత గొప్ప పనిచేస్తున్నారనేది అర్థమైందని చంటì బాబు చెప్పారు.

తాను ఏ విషయాల్లో రాజీపడబోనని.. అయితే సీఎం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడం.. తమకు ఆ మేర ప్రజల నుంచి స్వాగత సత్కారాలు లభిస్తుండటంతో జగన్‌ తమ ప్రత్యర్థులకు సైతం ఎందుకు పథకాలు అందించారో అవగతమైందన్నారు. పార్టీ నేతలు వచ్చి పోతున్నా.. జగన్‌ మాత్రమే తమకు డబ్బులు వేస్తున్నారని ప్రజలంతా చెప్పుకుంటున్నారని తెలిపారు.

అసలు విషయం తెలియక జగన్‌పైన తాను, తమ పార్టీ కార్యకర్తలు కోపగించుకున్నామని అందుకు ఆయన తమను మనస్ఫూర్తిగా క్షమించాలని వేడుకున్నారు. దీంతో ఎమ్మెల్యే చంటిబాబు మాటలకు జగన్‌ నవ్వుతూ ఉండిపోయారు.

తన నియోకవర్గ పరిధిలో ఇథనాల్‌ ప్లాంట్‌ తీసుకురావటంపై సంతోషం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడం మంచి నిర్ణయమన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.