Begin typing your search above and press return to search.
ఫాఫం.. జగ్గారెడ్డిని రాహుల్ గాంధీ పట్టించుకోవడం లేదా?
By: Tupaki Desk | 12 Sep 2022 5:30 PM GMTకాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూనే అసమ్మతి రాజేస్తున్నారు జగ్గారెడ్డి. ఈయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఫక్తు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా రాజకీయం నడిపారు. రేవంత్ ను పీసీసీ చీఫ్ కాకుండా అడ్డుకున్నారు. వద్దంటూ ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేశారు. కానీ రేవంత్ ను పీసీసీ చీఫ్ కాకుండా మాత్రం ఆపలేకపోయారు. తాజాగా కాంగ్రెస్ లోని అసమ్మతులకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ప్రాధాన్యత కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ పక్కనపెడుతున్నట్టు అర్థమవుతోంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ పాదయాత్ర తన నియోజకవర్గం సంగారెడ్డి నుంచి పోతున్న విషయం కూడా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయం ఎవరూ చెప్పలేదని.. సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నానని జగ్గారెడ్డి అనడం షాకింగ్ గా మారింది. రాహుల్ యాత్ర సంగారెడ్డిలో 30 కి.మీలు కొనసాగుతుందని జగ్గారెడ్డి తెలిపారు. పాదయాత్ర సంగారెడ్డిలో ప్రవేశించిన దగ్గర నుంచి ముగిసేదాకా ప్రజలను భాగస్వాములను చేస్తామని తెలిపారు.
‘నా నియోజకవర్గానికి సంబంధించి రాహుల్ పాదయాత్రపై క్లారిటీ తీసుకుంటాను. నా నియోజకవర్గంలో ఉందని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఓఆర్ఆర్ మీదుగా పాదయాత్ర చేయడం వల్ల ఉపయోగం ఉండదు. శంషాబాద్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, గచ్చిబౌలి, లింగంపల్లి, సంగారెడ్డి మీదుగా ఉండేలా చూడాలని పీసీసీని కోరుతా’నని సంగారెడ్డి తెలిపారు.
రాహుల్ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకునేలా ప్రణాళికలు రూపొందస్తామని తెలిపారు. దీనిపై స్థానిక నేతలతో చర్చించి వర్కవుట్ చేస్తామని జగ్గారెడ్డి తెలిపారు.
దీన్ని బట్టి రాహుల్ గాంధీ పాదయాత్ర కనీసం తన నియోజకవర్గానికి వస్తుందో లేదో కూడా తెలియని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉండడం విస్తుగొలుపుతోంది. అసలు జగ్గారెడ్డిని పార్టీలోని అధిష్టానం పెద్దలు పట్టించుకోవడం లేదని.. ఆయన అసమ్మతియే ఇప్పుడు ఆయనను దూరం పెట్టడానికి కారణం అయ్యిందని అంటున్నారు.
ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక విషయంలోనూ జగ్గారెడ్డి అసమ్మతి రాజేశారు. ఎవరు పిలిచినా.. పిలవకున్నా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళతానని జగ్గారెడ్డి తొడగొట్టారు. మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించడానికి ఓ వైపు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంటే మరోవైపు జగ్గారెడ్డి మాత్రం సొంత పార్టీలోనే మరో వర్గంగా అసమ్మతి రాజేయడం అక్కడ ఓటమికి దారితీస్తుందన్న భయాలు కాంగ్రెస్ శ్రేణులను వెంటాడుతున్నాయి. అయినా జగ్గారెడ్డి మాత్రం వెనక్కితగ్గడం లేదు.సొంత పార్టీలోనే ఉంటూనే కాంగ్రెస్ ఓటమికి జగ్గారెడ్డి అసమ్మతి రాజేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.