Begin typing your search above and press return to search.
రేవంత్ రెడ్డికి సారీ చెప్పిన జగ్గారెడ్డి
By: Tupaki Desk | 25 Sep 2021 1:41 PM GMTటీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వాస్తవానికి జగ్గా రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపాయి. అసమ్మతికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగి జగ్గారెడ్డిపై సీరియస్ అయినట్టు సమాచారం. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి జగ్గారెడ్డి మొగ్గుచూపి సారీ చెప్పి ముగింపు పలికినట్టు తెలుస్తోంది.
ఈ వివాదాన్ని పరిష్కరించాలని కాంగ్రెస్ హైకమాండ్ టి-కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్కం టాగూర్‌ను ఆదేశించింది. ఏఐసీసీ కార్యదర్శుల నుండి జగ్గా రెడ్డి వ్యాఖ్యలపై వివరాలను అడిగారు. దీంతో ఏఐసీసీ ప్రతినిధులు జగ్గారెడ్డిని గాంధీ భవన్ కు పిలిపించి వివరణ కోరారు.
కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యిందని గ్రహించిన జగ్గా రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు కానీ రేవంత్ తన నియోజకవర్గం సంగారెడ్డిలో పర్యటించిన సమాచారం లేనందుకు విచారం వ్యక్తం చేశాడు.
ఏఐసీసీ జోక్యం చేసుకొని జగ్గా రెడ్డిని మీడియా ముందు క్షమాపణలు చెప్పేలా చేసింది.. "మీ ఆందోళనలను మీడియా ముందు వ్యక్తం చేయడం.. మాట్లాడటం పొరపాటు, ఇది పార్టీకి మరింత నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి అలాంటి వాటిని మీడియాకు తీసుకెళ్లవద్దని హైకమాండ్ నన్ను కోరింది. రేవంత్‌ని కలుసుకుని మొత్తం వివాదానికి ముగింపు పలకాలని ఆశిస్తున్నాను”అని జగ్గా రెడ్డి అన్నారు.
మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సైతం దీనిపై వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇటీవల సంగారెడ్డి -జహీరాబాద్ పర్యటనలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని చెప్పారు. ఈ అంతరాన్ని పూరించడానికి మేం ప్రయత్నిస్తామని తెలిపారు.
ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి నిర్ణయించారు. నేతల మధ్య వివాదాలు ముగింపు పలకడానికి నాయకులకు దిశానిర్ధేశం చేయనున్నారు.