Begin typing your search above and press return to search.
రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 24 Sep 2021 7:33 AM GMTకాంగ్రెస్ లో అప్పుడే సెగలు.. పొగలు బయటపడుతున్నాయి. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాగానే బయటపడ్డ విభేదాలు ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. అందరి అసంతృప్తిని చల్లార్చి దూకుడుగా ముందుకెళుతున్న రేవంత్ రెడ్డి ముందరి కాళ్లకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు బంధం వేస్తున్నారు.
కాంగ్రెస్ లో సింగిల్ హీరో కుదరదు.. ఒక్కడి ఇమేజ్ కోసం వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘ఇది పార్టీనా.. లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా’ అని జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో చర్చించకుండా ముందే ప్రోగ్రాంలు ఫిక్స్ చేయడం ఏంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో అందరూ ఒకటే.. ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదు అని జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘సంగారెడ్డికి పీసీసీ చీఫ్ వస్తే నాకు సమాచారం ఇవ్వరా.. ఈ మాత్రం ప్రోటోకాల్ కూడా తెల్వదా? ’ అని మండిపడ్డారు. జగ్గారెడ్డికి, రేవంత్ రెడ్డికి విభేదాలు ఉన్నాయని పరోక్షంగా చెబుతున్నారా? అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందు తాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాగా సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ సభాపక్షం సమావేశం కానున్న నేపథ్యంలో జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదని.. పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా నాపై అసత్య ప్రచారాలు చేస్తారా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.