Begin typing your search above and press return to search.
జగ్గారెడ్డి వీడియో సంచలనం.. విజయారెడ్డి హత్య వెనక ఉంది వీళ్లే...
By: Tupaki Desk | 5 Nov 2019 1:20 PM GMTతెలంగాణలో మహిళా ఎమ్మార్వో విజయారెడ్డిని పట్టపగలే తన కార్యాలయంలో సజీవ దహనం చేసిన సంఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ ఉదంతంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన నేపథ్యంలో మరింతగా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు.
విజయారెడ్డి హత్యకు ఓ పత్రిక, ఓ మంత్రితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కారణమని వీడియో రికార్డు చేసి మరి మీడియాకు విడుదల చేశారు. రాష్ట్ర విభజనకు ముందు ఉన్న రెవెన్యూ చట్టం అటు రైతులు... ఇటు అధికారులకు వెసులుబాటుగా ఉండేదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కెసిఆర్ రెవెన్యూ చట్టాన్ని మార్చడంతో రైతులు, అధికారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఒక పత్రికలో వస్తున్న వార్తలు రైతులకు, అధికారుల మధ్య వైరాన్ని పెంచుతున్నాయని కూడా ఆయన విమర్శించారు.
ఆ పత్రికలో ఇటీవల వచ్చిన ఓ శీర్షిక ప్రజల్లో విషాన్ని నూరిపోసిందని ఫలితంగా అధికారులపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని జగ్గారెడ్డి విమర్శించారు. అక్కడితో ఆగని ఆయన సమాజంలో అవినీతిని, లంచాలు అరికట్టడం ఏ నాయకుడికి కూడా సాధ్యం కాదని చెప్పారు. ఇక తహసీల్దార్ మృతి ఘటనలో ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తప్పు ఉందన్నారు. నిన్నమొన్నటి వరకు ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థిస్తూ వచ్చారని... ఇది నిజమా కాదా ? వాళ్ళే చెప్పాలని ఆయన ప్రశ్నించారు. విజయారెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆవేశానికి ప్రభుత్వ విధానాలు కారణమైతే... తహసీల్దార్ చావుకు ఉద్యోగ సంఘాలే కారణమని... ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే రాష్ట్రం పెద్ద అగ్నిగుండం అవుతుందని ఆయన హెచ్చరించారు.