Begin typing your search above and press return to search.
ట్విటర్ హ్యాక్ వ్యక్తి అరెస్ట్: ‘చించావ్ పో’ అన్నది కలెక్టర్ కాదు
By: Tupaki Desk | 23 Feb 2020 6:34 AM GMTఒక ఐఏఎస్ అధికారి.. జిల్లాకు పాలనాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. అలాంటి వ్యక్తి ఓ నటి అప్ లోడ్ చేసిన ఫొటోలుకు ‘చించావ్ పో’ అనే ట్వీట్ చేయడం అంతటా వైరలైంది. అయితే ఆ ట్వీట్ చేసింది తాను కాదని.. ఆ అధికారి స్వయంగా ప్రకటించాడు. తన అధికారిక ట్విటర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు.. అది చేసింది.. తాను కాదని చెప్పేశాడు. ఇక దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అందరికీ ఆసక్తికరంగా మారింది. అయితే చివరకు ఆ ట్వీట్ చేసింది.. ఆ ఐఏఎస్ అధికారి కాదని తేలింది.
ఫిబ్రవరి 18వ తేదీన ఫొటోషూట్ లో దిగిన కొన్ని ఫొటోలను తన ట్విటర్ లో అప్ లోడ్ చేసింది. అయితే ఆ ఫొటోలను చూసిన అభిమానులు కామెంట్ల మీద కామెంట్లు చేశారు. ఈ సమయంలో ‘చించావ్ పో’ ఒకరు ట్వీట్ చేశారు. అయితే అది చేసింది.. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి అధికారిక ఖాతా. జగిత్యాల కలెక్టర్ పేరుతో ఉన్న ట్విటర్ ఖాతా నుంచి ఆ కామెంట్ రావడంతో వైరలైంది. రష్మికను ఉద్దేశించి.. చించేశావ్ పో అంటూ ఏకంగా కలెక్టర్ కామెంట్ చేశారని నెటిజన్లు దాన్ని రీట్వీట్లు చేస్తూ.. సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాధ్యతగల ఒక జిల్లా కలెక్టర్ ఈ విధంగా కామెంట్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ ట్వీట్ పై కలెక్టర్ పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అలా వారికి వీరికి తెలిసి చివరకు రాష్ట్రమంతటా తెలిసిపోయింది. ఈ విషయం బాధిత కలెక్టర్ రవికి ఆలస్యంగా తెలిసింది. దాన్ని చూసిన కలెక్టర్ తాను.. ఆ కామెంట్ చేయలేదు... ఎవరో చేశారు.. ట్విటర్ ఖాతా హ్యాక్ అయ్యిందని వివరణ ఇచ్చారు. అయితే ఆయన మాటను మొదట ఎవరూ నమ్మలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. వాస్తవంగానే ట్విటర్ ఖాతా హ్యాక్ అయ్యిందని గుర్తించారు. దీంతో హ్యాక్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసి జైల్లో వేశారు.
అయితే ఆ ట్వీటర్ హ్యాక్ చేసింది కూడా ఓ ఉన్నతోద్యోగి. ఐపీ అడ్రస్ ద్వార ఆయనెవరో గుర్తించారు. ఆయనెవరో కాదు.. జగిత్యాల జిల్లాకే చెందిన డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీయల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 2018 డిసెంబర్ నుంచి ఆ ట్విటర్ ఖాతాను వినియోగిస్తున్నట్లు తెలిసింది. దీంతో జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి ఊపిరి పీల్చుకున్నారు.