Begin typing your search above and press return to search.
సూర్యాపేటలో 'జై భీం' తరహా ఘటన !
By: Tupaki Desk | 12 Nov 2021 10:30 AM GMTమన న్యాయస్థానం ముందు అందరూ సమానమే. తప్పు చేసిన వాడు తమ్ముడైన కానీ శిక్షించాల్సిందే. అదే ధర్మం. కానీ ఈ రోజుల్లో పెద్ద వారు, పేద వారని విడతీసి అమాయకుల్ని చేసి హింసిస్తున్నారు. డబ్బు ఎవరి వద్ద ఉంటె వారే నిర్ణేతలు. అధికారుల్లో చాలామంది వారికే మద్దతు పలుకుతున్నారు. పెద్దవారు , ఉన్నవారు తప్పులు చేస్తే ఒక రకంగాను , లేని వారు తప్పు చేస్తే ఒక విధంగానూ చూస్తున్నారు. అన్యంపుణ్యం ఎరుగని గిరజనుడిపై అన్యాయంగా దొంగతనం నేరం మోపుతారు. పోలీస్‌స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. అలాంటి దుర్మార్గపు పోలీసులను ఓ లాయర్ న్యాయస్థానం ద్వారా ఎలా శిక్షించగలిగాడన్న కథాంశంపై తెరకెక్కిన సినిమా జైభీమ్. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందింది.
నిజజీవిత కథతో తీసిన ఈ చిత్రంలో వెనకబడిన తరగతులపై పోలీసులు ఎలాంటి దాష్టీకాలకు పాల్పడతారనేది కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇలాంటి దురాగతాలు నిజజీవితంలోనూ కళ్లకు కడుతున్నాయి. తెలంగాణలోనూ జైభీమ్ తరహా దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. దొంగతనం కేసులో ఓ గిరిజనుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని చిత్రహింసలు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరులో ఐదు రోజుల క్రితం ఓ దొంగతనం జరిగింది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తే.. నవీన్ అనే వ్యక్తి కనిపించాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టయిల్ లో విచారించి మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
కేసు విచారణలో భాగంగా తనతో పాటు అదే గ్రామానికి చెందిన పలువురు చోరీలో పాల్గొన్నట్లు నవీన్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే వారిలో ఓ రైతు ఉన్నాడు. అతడే ధరావత్ వీరశేఖర్. తనకే పాపం తెలియదని చెప్పినా వినకుండా కాళ్లు కట్టేసి దారుణంగా హింసించారు. పోలీసుల దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయాడు.
తాను ఏ తప్పు చేశానో చెప్పకుండా తీసుకెళ్లారని, బాగా కొట్టారని ఎందుకు కొడుతున్నారో కూడా చెప్పలేదని వాపోయాడు వీరశేఖర్. విచారణ తర్వాత ఇంటికి వెళ్లిన వీరశేఖర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కాళ్లు ఉబ్బిపోయి నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించి తర్వాత పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. వీరశేఖర్‌ను హింసించిన ఎస్ఐపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి ఈ విషయం బయటికి పొక్కకుండా ఎస్ఐ కాళ్లబేరానికి వచ్చాడు. పెద్ద మనుషుల ద్వారా ఈ వ్యవహారాన్ని రాజీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సై లింగంను వీఆర్‌కు అటాచ్ చేశారు ఎస్పీ రాజేంద్రప్రసాద్. దొంగతనం కేసులో యువకుడిని ఎస్సై లింగం చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపణలతో.. ఆతనిపై డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకుంది. ఆత్మకూరు ఎస్సై లింగయ్య వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఉప్పల్ లో ఎస్సైగా పనిచేసిన లింగయ్య, ఓ కేసులో సస్పెన్షనకు గురై సూర్యాపేటకు బదిలీ అయ్యారు. సూర్యాపేటలోనూ లింగయ్యపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఓవ్యక్తిని ఇష్టమొచ్చినట్టు చితకబాదడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
అంతే కాకుండా లాక్ డౌన్ లోనూ లాఠీకి పనిచెప్పారు ఎస్సై లింగయ్య. ఓ నర్సు భర్తపై చేయి చేసుకున్న ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ప్రవర్తన సరిగా లేకపోవడంతో సూర్యాపేట నుంచి వీఆర్‌కు లింగయ్యను బదిలీ చేశారు. ఆ తర్వాత వీఆర్ నుంచి ఆత్మకూర్ పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఓ నేత ప్రమాణ స్వీకారానికి వెళ్లాడన్న కక్షతో సింహాద్రి అనే యువకుడిపై అక్రమ కేసు బనాయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు శరామోజీ తండాకు చెందిన ధరావత్ వీర శేఖర్‌ని ఓ దొంగతనం కేసులో అకారణంగా ఇరికించారు. ఇంటరాగేషన్ పేరుతో పిచ్చకొట్టుడు కొట్టాడని చెప్తున్నారు.