Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ సమావేశంలో ‘జై ఈటల’ నినాదాలు
By: Tupaki Desk | 29 May 2021 2:30 PM GMTటీఆర్ఎస్ నుంచి ఈటలను వెళ్లగొట్టినా ఆయన అభిమానాన్ని మాత్రం వెళ్లగొట్టలేకపోతోంది. ఇప్పటికీ టీఆర్ఎస్ లో ఈటలకున్న పేరు, ప్రఖ్యాతలను టీఆర్ఎస్ నేతలు చెరిపివేయలేకపోతున్నారు. తాజాగా టీఆర్ఎస్ మీటింగ్ లో ‘జై ఈటల’ నినాదాలతో మారుమోగడం చర్చనీయాంశమైంది.
తాజాగా ఈటల సొంత నియోజకవర్గంలో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ వర్సెస్ ఈటల వర్గాలు రెండుగా విడిపోయి రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఢీ అంటే ఢీ అనే విధంగా అక్కడ పరిస్థితులున్నాయి. పోటీపోటీగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.ఒక వర్గం నుంచి మరో వర్గంలోకి వలసలు కూడా ఎక్కువయ్యాయి.
అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రులు గంగుల, హరీష్ రావులతో ఈటల అనుచరులను నేతలను ఆయన వెంట వెళ్లకుండా తాయిలాలు ఇస్తూ ఆకర్షిస్తున్నాయి. వలసలను ప్రోత్సహిస్తున్నాయి. పెద్దఎత్తున ఈటల వర్గాన్ని బీజేపీ నేతలను టీఆర్ఎస్ కు చేర్చుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా వీణవంకలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈటల వైపు ఎవరూ వెళ్లొద్దని కార్యకర్తలకు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. అయితే లక్ష్మణ్ ముందే టీఆర్ఎస్ నేతలు ఈటల రాజేందర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ‘జై ఈటల ’ నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో టీఆర్ఎస్ నేతలు ఖంగుతిన్న పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు ఈటల మద్దతుదారులను సమావేశం నుంచి బయటకు పంపించారు.