Begin typing your search above and press return to search.
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్.. జైలుశిక్ష తప్పు
By: Tupaki Desk | 20 Feb 2019 11:07 AM GMTసెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన పాపానికి కింద కోర్టు ఒకటి ఓ వ్యక్తికి కఠిన శిక్ష విధించింది. 4 రోజుల జైలు శిక్ష, జరిమానా విధించింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి పై హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇంత చిన్న నేరానికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించడంపై కింది కోర్టును తప్పుపట్టింది. చిన్న నేరానికి జరిమానా వేసి హెచ్చరించకుండా అంత పెద్ద శిక్ష విధించడం సరికాదని హితవు పలికింది. యువకుడిగా ఉంటూ జైలు శిక్ష అనుభవిస్తే భవిష్యత్తులో అతనితోపాటు వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో శిక్ష విధించే ముందు పరిశీలించాలని కింది కోర్టులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది.
హైదరాబాద్ కు చెందిన భరద్వాజ అనే యువకుడు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ పోలీసుల కంట పడ్డారు. వారు పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. కింది కోర్టు నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ భరద్వాజ మేనమామ హైకోర్టులో అత్యవసరంగా మంగళవారం ఉదయం కోర్టు అనుమతితో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం చిన్న నేరానికి అంత శిక్ష అవసరం లేదని స్పష్టం చేసింది. సైబరాబాద్ నాలుగో మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ ను మందలించింది. రూ.500 జరిమానా చెల్లిస్తే చాలని తీర్పును వెలువరించింది.