Begin typing your search above and press return to search.
మాల్యా కోసం జైలు రెడీ...ఎక్కడంటే..
By: Tupaki Desk | 6 Feb 2019 5:56 PM GMTవ్యాపారవేత్త, బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు టోకరా పెట్టి పరారీలో ఉన్న విజయ్ మాల్యా విచారణ వేగవంతం కానుంది. బ్రిటన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలుపుతూ బ్రిటన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆ దేశ హోం శాఖ మంత్రి సాజిద్ జావీద్ సంతకాలు చేశారు. మాల్యాను భారత్‌కు అప్పగించాలని గతేడాది డిసెంబర్ 10న బ్రిటన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అప్పగింత ఒప్పంద ప్రక్రియలో భాగంగా చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశాలను హోం శాఖ మంత్రికి పంపారు. మాల్యా అప్పగింతపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. రెండు నెలల్లోగా ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, సోమవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఈ నిర్ణయంపై బ్రిటన్‌లోని హైకోర్టులో అప్పీల్ చేస్తానని మాల్యా ట్విట్టర్‌లో వెల్లడించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు జావీద్ ఆమోదం తెలిపారని హోం శాఖ ధ్రువీకరించిండంతో తదుపరి ప్రక్రియ మొదలైంది.
మాల్యాను ఉంచేందుకు జైల్లో అన్నీ సిద్ధం చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. మాల్యాను లండన్ నుంచి తీసుకువచ్చిన వెంటనే...అతన్ని ఉంచేందుకు ఆర్దర్ రోడ్ జైలులో ఓ గదిని రెడీ కూడా చేసినట్లు ఈడీ తెలిపింది. మాల్యాను భారత్ కు అప్పగించే దస్త్ర్రంపై ఇటీవలే యూకే హోంమంత్రిత్వ శాఖ సంతకం చేసిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 10న న్యాయమూర్తి ఆర్బుత్‌నాట్ తీర్పు వెలువరిస్తూ... తన ఆర్థిక లావాదేవీలపై మాల్యా భారత్ కోర్టుల్లో సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. తప్పుడు పత్రాల ద్వారా రుణాలు పొందినట్లు స్పష్టంగా తెలుస్తున్నదని, మనీ ల్యాండ్‌రింగ్‌కు మాల్యా కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా తేలినట్లు చెప్పారు. మాల్యాను భారత్‌కు అప్పగించిన తరువాత ఆయనను ఉంచబోయే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న బ్యారక్ 12లో వసతులు సరిగా లేవని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని మాల్యా తరఫు న్యాయవాది వాదనను ఆమె తోసిపుచ్చారు. అక్కడి వసతులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. హోం శాఖ కార్యదర్శి నిర్ణయం అనంతరం 14 రోజుల్లోగా కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు మాల్యా అనుమతి పొందాల్సి ఉంటుంది.