Begin typing your search above and press return to search.

ఎమ్మార్పీ కంటే ఎక్కువా? కంప్లైంట్ చేస్తే జైలుకే!

By:  Tupaki Desk   |   12 Dec 2017 12:43 PM GMT
ఎమ్మార్పీ కంటే ఎక్కువా? కంప్లైంట్ చేస్తే జైలుకే!
X
బ‌స్టాండ్‌.. రైల్వేస్టేష‌న్‌.. పుణ్య‌క్షేత్రాలు.. సినిమా థియేట‌ర్లు ఇలా చెప్పుకుంటూ పోతే స‌గ‌టుజీవిని దోచుకునే వ్యాపారులు చాలామందే ఉంటారు. ఎక్క‌డైతే ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుందో.. ఎక్క‌డైతే వ‌స్తుసేవ‌ల ల‌భ్య‌త త‌క్కువ ఉంటుందో ఆరాచ‌కం నిద్ర లేస్తుంది. అదే చ‌ట్టాల్ని చ‌ట్టుబండ‌లు చేసేలా చేస్తుంది.

ఎమ్మార్పీ కంటే త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తువుల్ని అమ్మ‌టం.. అదేమ‌ని అడిగిన వారిని కించ‌ప‌రుస్తూ మాట్లాడే వ్యాపారులు కొంద‌రు క‌నిపిస్తుంటారు. ఇలాంటి వారి మీద కంప్లైంట్ చేస్తే ప్ర‌యోజ‌నం ఏం ఉంటుంద‌ని చాలామంది అనుకుంటారు. ఇకపై అలా అస్స‌లు అనుకోవ‌ద్దు. ఎందుకంటే.. ఎమ్మార్పీ (గ‌రిష్ఠ చిల్ల‌ర అమ్మ‌క‌పు ధ‌ర‌) కంటే ఎక్కువ అమ్మిన వారిపై క‌ఠిన చ‌ర్యలు త‌ప్ప‌వ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

వాట‌ర్ బాటిళ్ల కోసం వినియోగ‌దారుల నుంచి ఎక్కువ ధ‌ర వ‌సూలు చేస్తే క‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకోవ‌ట‌మే కాదు.. అలాంటి వారికి ఫైన్ తో పాటు.. జైలుశిక్ష ప‌క్కా అని కేంద్రం స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ వ‌సూలు చేయ‌టం వినియోగ‌దారుడి ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీయ‌ట‌మే కాదు.. ప‌న్ను ఎగ‌వేత కింద‌కువ‌స్తుంద‌న్న కొత్త విష‌యాన్ని కేంద్రం కోర్టుకు వెల్ల‌డించింది.

కొన్ని హోట‌ళ్లు.. రెస్టారెంట్లు.. మ‌ల్టీఫ్లెక్సుల యాజ‌మాన్యాలు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధ‌ర వ‌సూలు చేయ‌టంపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కేంద్రం త‌న వాద‌న‌ను వినిపిస్తూ.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ వ‌సూలు చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొంది. మాట‌లతో స‌రి పెట్ట‌కుండా చేత‌ల వ‌ర‌కూ వెళ్లి చ‌ర్య‌లు తీసుకుంటే.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వ్యాపారుల ఆగ‌డాల‌కు చెక్ ప‌డుతుంది.