Begin typing your search above and press return to search.

వెబ్ సైట్లు, సోషల్ మీడియాపై బాబు కన్నెర్ర

By:  Tupaki Desk   |   17 April 2017 7:18 AM GMT
వెబ్ సైట్లు, సోషల్ మీడియాపై బాబు కన్నెర్ర
X
సోషల్ మీడియా - వెబ్ సైట్లు వేదికగా తమ పార్టీ - ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని ఏపీ సీఎం చంద్రబాబు డిసైడయ్యారు. అందులో భాగంగా ఆయన చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే చంద్రబాబు ఆదేశాల మేరకు ఓ టీం ఇంటర్నెట్ ను - సోషల్ మీడియాను వడబోసినట్లు తెలుస్తోంది. టీడీపీని - చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శనాత్మక వార్తలు రాస్తున్న సైట్లు... ఫేస్ బుక్ పేజీలు.. వాట్సాప్ గ్రూపులను గుర్తించి లిస్టు తయారు చేసినట్లుగా తెలుస్తోంది.

సీఎం - మంత్రుల ఫొటోల‌ను మార్ఫింగ్ చేయ‌డం... ఘాటైన కామెంట్లు చేయడం.. వాటిని ఫేస్‌ బుక్‌ - వాట్సాప్‌ ల్లో స్ప్రెడ్ చేయడాన్ని కొందరు పనిగా పెట్టుకున్నారని టీడీపీ అంటోంది. ప్ర‌తిప‌క్ష పార్టీల హార్డ్ కోర్ మద్దతుదార్లు కొందరు ఇదే పనిలో ఉన్నట్లుగా టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు వ్యతిరేక ప్రచారాన్ని కొందరు యువత భుజాన వేసుకున్నారని.. అలాగే పలువురు జర్నలిస్టులు వెబ్ సైట్లు పెట్టి చంద్రబాబు వ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

అయితే.. చంద్రబాబు వ్యతిరేక ప్రచారం కొత్తేమీ కాకపోయినా రిలయన్సు జియో ఫ్రీ ఇంటర్నెట్ వచ్చాక అది అందరికీ చేరిపోతోంది. ఫేస్ బుక్ - వాట్సాప్ లతో పాటు టెలిగ్రాం యాప్ లోనూ భారీ ఎత్తున చంద్రబాబు వ్యతిరేక పోస్టులు వస్తున్నాయి. అలాగే యూట్యూబ్ వీడియోలైతే కోకొల్లలు. ఒకప్పుడు డాటా ధరలు విపరీతంగా ఉన్న సమయంలో ఇలాంటి వీడియోలు వచ్చినా ఎవరూ ఓపెన్ చేసి చూసేవారు కాదు. కానీ... ఇప్పుడు ఇంటర్నెట్ ఉచితం కావడంతో తెగ చూస్తున్నారు. అందులోనూ ఎంతో ఆసక్తికరంగా వాటిని రూపొందిస్తుండడంతో తాము చూడడమే కాకుండా తమకు తెలిసినవారిని కూడా చూడమంటూ ఫార్వర్డు చేస్తున్నారు.

దీంతో ఇలాంటి నెగటివ్ ప్రచారం అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ నేతలకూ చేరుతున్నాయి. ఇక వెబ్ సైట్లలోనూ చంద్రబాబును ఏకేస్తూ ఘాటైన వార్తలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు వీటిని సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్ ద్వారా గ‌వ‌ర్న‌మెంట్‌ పై నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్న వారిపై ప్రభుత్వం వైపు నుంచే చట్టపరంగా చర్యలు తీసుకునే అంశాల్ని పరిశీలిస్తున్నారు. దీనికోసం సైబ‌ర్ లాను ఇంప్లిమెంట్ చేయ‌డంపై లీగ‌ల్ ఎక్స్‌ ప‌ర్ట్ సాయం తీసుకుంటార‌ని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/