Begin typing your search above and press return to search.
కేసీఆర్ ది దొంగ దీక్ష..వీడియోలున్నాయన్న సీనియర్
By: Tupaki Desk | 28 Feb 2017 1:27 PM GMTకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరేందుకు కీలక ఘట్టమైన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష అంతా బూటకమని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేపట్టిన ఉపవాసదీక్ష ముమ్మటికీ దొంగ దీక్షనేనని, అలాంటి ఆధారాలన్నీ వీడియోతో సహా తన వద్ద సిద్ధంగా ఉన్నాయని సంచలన ప్రకటన చేశారు. అప్పట్లో ఈ విషయాలను తాను బయటకు చెబితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకే విఘాతం కలుగుతుందని నోరు విప్పలేదని ఆయన అన్నారు. తాను కేసీఆర్ బండారాన్ని బయటపెడితే కోలుకోలేని ఆయన కేసీఆర్ ను హెచ్చరించారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన ఆవేదన సభలో జైపాల్ రెడ్డి మాట్లాడారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఉపవాసం దొంగ ఉపవాస దీక్ష అని ఆరోపించిన జైపాల్ రెడ్డి తాను చెప్పే మాటలు అబద్ధం కాదని, ముమ్మటికీ నిజంగానే చెబుతున్నానని, తన దగ్గర అప్పటికి వీడియోలన్ని ఉన్నాయన్నారు. ఖమ్మం ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ప్రతి నిమిషం అక్కడి అప్పటి కలెక్టర్ తో కేంద్రమంత్రిగా తాను ప్రతి నిమిషం కేసీఆర్ దీక్ష విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్నానన్నారు. అంతేకాదు ప్రతిరోజూ కేసీఆర్ ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ చేశారో కూడా ఆధారాలు ఉన్నాయన్నారు. కేసీఆర్ కు ఇచ్చినటువంటి అన్ని వసతుల ఆధారాలు తన దగ్గర ఉన్నాయని జైపాల్ రెడ్డి తెలిపారు. మనిషికి కావల్సిన న్యూట్రిషియన్ 750 క్యాలరీస్ కు సంబంధించిన ఇంజెక్షన్లు కూడా కేసీఆర్ తీసుకున్నారని, వీటన్నింటికీ ఆయన ఆమోదంతోనే డాక్టర్లు సైతం వైద్యసేవలు అందించారన్నారు. అక్కడి నుంచి కేసీఆర్ ను నిమ్స్ కు తరలించాక తాను నిమ్స్ డైరెక్టర్ తో కూడా మాట్లాడనని, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తే డాక్టర్లు సమాధానం విచిత్రంగా చెప్పారని జైపాల్ రెడ్డి అన్నారు. సాధారణ వ్యక్తి మనిషికి కావల్సిన ఇంజెక్షన్లను కేసీఆర్ తీసుకుంటున్నారని చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యానని జైపాల్ రెడ్డి అన్నారు. అయితే వాటి ఆధారాలు కావాలని నిమ్స్ డైరెక్టర్ ను కోరితే ఆధారాలు పంపించారని జైపాల్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ కు ఇంజెక్షన్లు ఇచ్చే వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయని జైపాల్ రెడ్డి ప్రకటించారు. అప్పట్లో ఈ విషయాలను తాను బయటకు చెబితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకే విఘాతం కలుగుతుందని నోరు విప్పలేదని ఆయన అన్నారు. తన దగ్గరికి తెలంగాణ కావాలంటూ కేసీఆర్ ఎన్నిసార్లు వచ్చారో ఆయనకు బాగా తెలుసని, ప్రస్తుతం ఆయనకు బాగా ఆహంకారం పెరిగిందని జైపాల్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీని - నాయకులను తిట్ల పురాణంతో రాజకీయాలకు విలువలు లేకుండా చేస్తున్నారని, రాజకీయాల్లో సంస్కారం లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ ఒక్కరేనని జైపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను 45 ఏళ్ల పాటు ఎమ్మెల్యే, ఎంపిగా కొనసాగానని ఏనాడు కూడా అపశబ్ధం పలకలేదని, ఎక్కడైనా రాజకీయ నాయకులను ఆయా పార్టీలను విమర్శిస్తే తిట్ల పురాణంతో విమర్శించలేదని, అంశంపైనే మాట్లాడమే తప్ప కేసీఆర్ మాదిరిగా నీచమైన రాజకీయాలకు ఎప్పుడూ దిగలేదని అన్నారు. కేసీఆర్ ను గద్దె దింపడానికి ప్రజలు సిద్ధమయ్యారని, ఇది వారి దురదృష్టమని ఆయన ఎద్దేవా చేశారు. బాధ్యత, సభ్యత, సఖ్యత గల నాయకులు పాలకులుగా ఉంటేనే రాజకీయాల్లో విలువలు ఉంటాయని, ఈ మూడు అంశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేవని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/