Begin typing your search above and press return to search.
అమిత్ షా పరువు తీసేసిన జైపాల్ రెడ్డి
By: Tupaki Desk | 5 Nov 2016 2:48 PM GMT అమిత్ షా రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత దారుణమైన విమర్శను ఎదుర్కోలేదేమో... ఆయన్ను ఇంతగా ఎవరూ పరువు తీయలేదేమో... టీ కాంగ్రెస్ నేత - మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పరువు తీసేశారు. దేశాన్ని ఏలుతున్న పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నేతను ఒక్క మాటతో తలెత్తుకోలేకుండా చేశారు. ప్రధాని మోడీ కూడా గుడ్డిగా నమ్మే అమిత్ షా అంతటోణ్ని పట్టుకుని ఆయనో గల్లీ లీడర్ అని గడ్డిపరకలా తీసిపడేశారు. జైపాల్ కామెంట్లతో బీజేపీ నేతలంతా అవాక్కవుతున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను గల్లీ లీడర్ అంటూ జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటీష్ వారికి ఆరెస్సెస్ తొత్తుగా పనిచేసిందని విమర్శించారు. మన దేశానికి జవహర్ లాల్ నెహ్రూ - సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరూ రెండు కళ్లలాంటివారని.. ఇప్పుడు బీజేపీ పటేల్ ను పొగుడుతూ, నెహ్రూను విమర్శించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. నెహ్రూ - పటేల్ ఇద్దరూ దాదాపు పదేళ్లు జైలు జీవితం గడిపినా... ఇద్దరి మధ్య ఏనాడూ అభిప్రాయ భేదాలు తలెత్తలేదని చెప్పారు.
హైదరాబాద్ నిజాంపై చేపట్టిన సైనిక చర్య పటేల్ ఒక్కరి సొంత నిర్ణయం కాదని... నెహ్రూతో కలసి తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు దిగజారడానికి ప్రధాని నరేంద్ర మోడీయే కారణమని మండిపడ్డారు. ఇదంతా ఎలా ఉన్నా బీజేపీలో 'దేశ్ కీ నేతా"గా చెలామణీ అవుతున్న అమిత్ షాను గల్లీ లీడర్ గా అభివర్ణించడం ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా ప్రధాన వార్త అయిపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/