Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్:ఆస్పత్రిలో రంగంలోకి దిగిన రోబోలు!
By: Tupaki Desk | 26 March 2020 1:06 PM GMTదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ ..కూడా రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 697 మంది కరోనా భాదితులు ఉన్నారు. అలాగే ఇప్పటివరకు 14 మంది కరోనా కారణంగా మరణించారు. అయితే , కొన్ని చోట్ల కరోనా పేషేంట్స్ కి ట్రీట్ మెంట్ చేస్తూ ..డాక్టర్లు కూడా కరోనా భారిన పడుతుండటంతో ..కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసేందుకు వైద్యులు కొత్తగా రోబోలను రంగంలోకి దించుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ హాస్పిటల్ లో కరోనా వైరస్ సోకిన వారికోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డులో రోగులకు చికిత్స అందించేందుకు రోబోలను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. జోద్ పూర్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఈ నర్సింగ్ రోబోలను తయారు చేశారు. ఏలాంటి ఛార్జీలు తీసుకుకోకుండా హాస్పిటల్ పనిచేసేందుకు తీసుకొచ్చారని చెప్పారు.
కరోనా వైరస్ రోగులకు నర్సుల స్థానంలో ఈ రోబోలు వైద్య సేవలు అందిస్తున్నాయని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. బుధవారం ఈ రోబోలు కరోనా రోగులకు చికిత్స అందించడంలో విజయవంతం అయ్యాయి. బ్యాటరీతో పనిచేసే ఈ రోబోల జీవిత కాలం 4 నుంచి 5ఏళ్లు అని వైద్యులు చెప్పారు. రోబోలను నర్సింగ్ సేవల కోసం ప్రవేశపెట్టడంతో నర్సులకు కరోనా వైరస్ సోకకుండా సురక్షితంగా ఉండవచ్చని వైద్యులు పేర్కొన్నారు.