Begin typing your search above and press return to search.

ఆ మృగం 40 మంది మ‌గాళ్ల‌ను అత్యాచారం చేసింద‌ట‌!

By:  Tupaki Desk   |   8 July 2019 9:29 AM GMT
ఆ మృగం 40 మంది మ‌గాళ్ల‌ను అత్యాచారం చేసింద‌ట‌!
X
షాకింగ్ అంశంగా చెప్పాలి. ఒక ప‌ట్టాన జీర్ణించుకోలేని ఈ వైనం వింటే మ‌నుషులు మృగం మాదిరి ఎందుకు త‌యార‌వుతార‌న్న సందేహం క‌లుగ‌క మాన‌దు. ఒక చిన్నారిని అత్యాచారం చేసిన కేసుకు సంబంధించి జైపూర్ పోలీసులు విచార‌ణ జ‌రిపి నిందితుడ్ని ప‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు చేసిన విచార‌ణ‌లో విస్తుగొలిపే వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ న‌ర‌రూప మృగం చెప్పిన వివ‌రాలు విన్న పోలీసులకు సైతం నోట మాట రాని ప‌రిస్థితి.

రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్ శాస్త్రి న‌గ‌ర్ కు చెందిన ఏడేళ్ల చిన్నారిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తి అప‌హ‌రించి.. అత్యాచారం చేశాడు. చిన్నారి త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమేరాల సాయంతో అత‌డ్ని గుర్తించారు. ముఖానికి ముసుగు ధ‌రించ‌టంతో అత‌డ్ని గుర్తించ‌టం సాధ్యం కాలేదు.

అయితే.. అత‌ను న‌డిపిన వాహ‌నం ఆధారంగా అత‌డ్ని గుర్తించే ప్ర‌య‌త్నం చేశారు. గ‌తంలో మ‌రికొన్ని నేరాలకు సంబంధించి అదే బైకు ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించిన పోలీసులు నిఘాను ముమ్మ‌రం చేసి.. అదుపులోకి తీసుకున్నారు. 35సంవ‌త్స‌రాల స‌ద‌రు నిందితుడు గ‌తంలో కొన్ని నేరాలు చేసిన‌ట్లు గుర్తించారు. పోలీసుల విచార‌ణ‌లో నిందితుడు తాను పాల్ప‌డిన దుర్మార్గాలు.. ఘోరాల గురించి నోరు విప్పాడు. అంతే.. వాడుచెప్పిన చిట్టాను విని పోలీసులు సైతం షాక్ తిన్న ప‌రిస్థితి.

అత‌గాడు చిన్న‌పిల్ల‌ల్ని అప‌హ‌క‌రించి.. వారిపై త‌న లైంగిక వాంఛ తీర్చుకొని అమ్మేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. అలా వ‌చ్చిన డ‌బ్బుతో మ‌ద్యం.. సెక్స్ కు బానిసైన అత‌గాడు.. ఆడ‌.. మ‌గ అన్న తేడా లేకుండా త‌న కామ‌వాంఛ‌ను తీర్చుకునేవాడు. ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డు 35 మంది చిన్నారులు.. 40 మంది మ‌గాళ్లు.. ట్రాన్స్ జెండ‌ర్ల‌పైనా అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లుగా పేర్కొన్నాడు. గ‌తంలోనూ అత‌డిపైన కేసులు న‌మోదైన విష‌యాన్ని పోలీసులు గుర్తించారు. తాజాగా అత‌డి నేర‌చ‌రిత్ర‌ను రికార్డు చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. ఇలాంటి కామ‌పిశాచి విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.