Begin typing your search above and press return to search.
ఏపీ విభజన వెనుక అసలు కుట్ర ఎవరిది?
By: Tupaki Desk | 9 Dec 2015 10:12 AM GMTఏపీ విభజనను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి పరిణామాలపై పుస్తకం రాస్తానన్నారు. అది ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ.... కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఇప్పుడో పుస్తకం రాస్తున్నారు. రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన ఆయన ఏపీ విభజనపై పుస్తకం రాస్తున్నారు. విభజన సమయంలో, ఆ తరువాత రెండు రాష్ట్రాల్లో పర్యటించిన జైరాం పలు కీలక చర్చల్లో పాల్గొన్నారు. డాక్యుమెంట్ల తయారీలోనూ, సంప్రదింపుల్లోనూ భాగస్వామి అయ్యారు.
ఒక దశలో రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకే నష్టమని వ్యాఖ్యానించిన ఆయన ఇప్పుడు ‘’ద బైఫరికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ - అండ్ బర్త్ ఆఫ్ తెలంగాణ’’ పేరుతో రాస్తున్న పుస్తకం ఎలాంటి సంచలనాలకు వేదికవుతుందో చూడాలి. విభజన నాటి పరిణామాలు, అందుకు దారి తీసిన పరిస్థితులు - ప్రేరేపణలు - లాభనష్టాలు వంటివన్నీ ఆయన తన పుస్తకంలో పొందుపరుస్తారని సమాచారం. ఈ పుస్తకం ఫిబ్రవరిలో మార్కెట్ లోకి రానుంది.