Begin typing your search above and press return to search.

జైరాంకే ద్రోహం అనిపించింది

By:  Tupaki Desk   |   9 Sep 2016 9:10 AM GMT
జైరాంకే ద్రోహం అనిపించింది
X
ఏపీ రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీనే అయినా విభ‌జ‌న ఎపిసోడ్ మొత్తాన్ని న‌డిపించిన వారిలో కీల‌క‌మైన వ్య‌క్తి మాజీ కేంద్ర‌మంత్రి జైరాం ర‌మేశ్‌. ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపికై మ‌రీ.. ఏపీని విభ‌జించిన ట్రాక్ రికార్డు జైరాం ర‌మేశ్ సొంతం. అమ్మ ఇచ్చిన ఆదేశాల్ని తూచా త‌ప్ప‌కుండా పాటించ‌టం.. ల‌క్ష్య సాధ‌న‌లో భాగంగా ఎన్ని కష్ట‌నష్టాల్ని ఎదుర్కొనేలా చేయ‌టం జైరాంకే చెల్లింది. విభ‌జ‌న ఎపిసోడ్‌ లో జైరాంను సీమాంధ్రులు ఓ రేంజ్ లో తిట్టుకున్నా వాటిని లైట్ తీసుకున్న ఆయ‌న‌కు.. తాజాగా ఏపీ విష‌యంలో మోడీ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఏపీకి హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం నో చెబుతుంద‌న్న మాట‌ల్లో అర్థం లేనద‌ని తేల్చేసిన జైరాం.. హోదా కానీ ఏపీకి రాకుంటే రాష్ట్రానికి జ‌రిగే న‌ష్టం ఎంత‌న్న విష‌యాన్ని లెక్క‌ల్లో చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా మోడీ స‌ర్కారు తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన ఆయ‌న ఆవేద‌న‌ను ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

= ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కంటితుడుపు చర్యే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పాపం ఎన్డీఏదే.

= విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే కుంటిసాకులు చెబుతున్నారు.

= ఏపీకి హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదు. ఆ పాపం 14వ ఆర్థిక సంఘానికి కాదు. అది మోదీ సర్కార్ నిర్ణయమే.

= పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదే అని చట్టంలో స్పష్టంగా ఉంటే రాష్ట్రానిదే బాధ్యత అని ఎలా అంటారు?

= వెంకయ్యనాయుడు సీనియర్‌ మంత్రిలా మాట్లాడటం లేదు.

= హోదా లేకుంటే ఏపీకి ఏటా రూ.60వేల కోట్ల నష్టం కలుగుతుంది. మూడేళ్ల‌లో జ‌రిగే న‌ష్టమెంతో. వేలాది కోట్ల న‌ష్టం ఏపీకి జ‌ర‌గ‌టం ఖాయం.

= జైట్లీ ప్ర‌క‌టించిన ప్యాకేజీలో ఏపీకి కొత్త‌గా ఇచ్చిందేమీ లేదు. కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు మానుకొని ఏపీకి న్యాయం చేయాలి.

= కార‌ణాలు తెలీవు కానీ వెంక‌య్య అస‌హ‌నంగా ఉన్నారు. ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోస‌మే వెంక‌య్య ఇదంతా చేస్తున్నారు.

= హోదా కోసం ఇత‌రుల్ని నిందించ‌టం మానేసి చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాలి. చ‌ట్టంలోని అంశాల్ని కేంద్రం తప్పుదారి ప‌ట్టిస్తోంది.

= చట్టంలోని 13వ షెడ్యూల్ ఓసారి చదవాలి. జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఏమీ లేదు. మోదీ ప్రభుత్వం ఏపీ ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేస్తోంది.