Begin typing your search above and press return to search.
సెంటిమెంట్ కోసం మీసం తీసిన సీఎం
By: Tupaki Desk | 27 Dec 2017 4:51 AM GMTకొన్ని సెంటిమెంట్లు చాలా చిత్రంగా ఉంటాయి. అయితే.. అలాంటి వాటిని తూచా తప్పకుండా పాటించే వారెందరో. తాజాగా అలాంటి సెంటిమెంట్‌ను పాటించి అందరి మనసుల్ని దోచుకోవటమే కాదు.. అప్పటివరకూ ఉన్న సంప్రదాయం మిస్ అవుతుందని దిగులు పడుతున్న వారికి తనదైన భరోసాను ఇచ్చారు హిమాచల్ ప్రదేశ్ తాజా సీఎం జైరాం ఠాకూర్.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక వింత సంప్రదాయం ఉంది. ఇప్పటివరకూ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేతల ఎవరికి మీసాలు లేవు. అయితే.. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఘన విజయం సాధించినా.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనుకున్న నేత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవటంతో మరొకరిని ఎంపిక చేయాల్సి వచ్చింది.
కిందామీదా పడి.. అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని చివరకు జైరాం ఠాకూర్ ను సీఎం క్యాండిడేట్ గా ఫైనల్ చేశారు. అంతా బాగుంది కానీ.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించే నేతకు మీసం ఉండని సంప్రదాయానికి భిన్నంగా జైరాం ఉండటంతో ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం ఇకపై ముగిసిపోతుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.
అయితే.. ఈ సంప్రదాయం గురించి తనకు కూడా అవగాహన ఉందన్న విషయాన్ని జైరాం తన చేతలతో చెప్పేశారు. సంప్రదాయాన్ని కంటిన్యూ చేసేపనిలో భాగంగా తన మీసాన్ని త్యాగం చేశారు. నున్నగా షేవ్ చేసుకొని.. మీసం లేని ముఖంతో పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలోనే ఆయన్ను సీఎంగా ఎన్నుకున్నారు. మీసం తీయటం ద్వారా పలువురి మనసుల్ని దోచేసుకున్నారని చెబుతున్నారు.