Begin typing your search above and press return to search.

ఎంపీ భరత్ తో వివాదం ఎందుకు మొదలైందో చెప్పిన జక్కంపూడి!

By:  Tupaki Desk   |   23 Sep 2021 5:41 AM GMT
ఎంపీ భరత్ తో వివాదం ఎందుకు మొదలైందో చెప్పిన జక్కంపూడి!
X
రాజమండ్రి ఎంపీ భరత్ కు.. రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సొంత పార్టీ.. అధికారంలో ఉన్న ఈ ఇద్దరు నేతలు తగవులాడుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ బజారు కీడ్చుకుంటున్న తీరు కలవరపరుస్తోంది. రాజమండ్రిలో ఇంత లొల్లి జరుగుతున్నా కూడా వైసీపీ హైకమాండ్ ఈ వివాదాన్ని పరిష్కరించకపోవడం ఆసక్తి రేపుతోంది. ఎంపీ, ఎమ్మెల్యేలు రోడ్డు మీదకు వచ్చి విమర్శలు చేసుకుంటున్నా ఆపడం లేదు. ఇద్దరిని పిలిచి మాట్లాడడం లేదు. కనీసం ప్రెస్ మీట్లు ఆపమని కూడా చెప్పడం లేదు. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ నడుస్తోంది.

దీన్ని మరింత పెంచుతూ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ పై నిప్పులు చెరిగాడు. మేం పదేళ్లుగా ప్రజాసేవ కోసం ప్రజల్లో తిరిగి నాయకులుగా ఎదిగామని.. కానీ 2019లో సార్వత్రిక ఎన్నికలకు 3 నెలల ముందు పార్టీ టికెట్ సంపాదించి నియోజకవర్గాల్లో ఒక హీరోలా తిరిగి.. మీడియాకు స్టార్ హీరోల పోజులిచ్చాడని ఎంపీ భరత్ పై జక్కంపూడి విరుచుకుపడ్డాడు..

ఉదయం ఆయన లేచినప్పటి నుంచి ప్రజల్లో తిరిగే వరకూ కెమెరాలు వెంటాడుతుంటాయని.. ఆయన ప్రజాసేవ చేయడం లేదని.. యాక్టింగ్ చేస్తున్నాడని జక్కంపూడి రాజా తీవ్ర విమర్శలు చేశారు. అయితే రాజకీయాల్లో ఇది కలవదని.. ఇదో టెంపరరీ సినిమా అయ్యి తర్వాత ఫ్లాప్ అవుతుందని జక్కంపూడి ఎద్దేవా చేశారు.

ఎన్నికల ప్రచారంలో కూడా తాను ఇచ్చిన ఇంటర్వ్యూలను ఫోన్ లో చూసుకుంటూ.. మధ్యలో ప్రజలకు అభివాదం చేసేవాడని ఎంపీ భరత్ పై జక్కంపూడి తీవ్ర విమర్శలు చేశారు. ఇలా చేయడం వల్లే తనకు ప్రజల్లో బాగా ఫాలోయింగ్ వచ్చిందని.. ఇలానే తాను గెలిచానని భ్రమ పడుతున్నాడని ఎద్దేవా చేశారు. బహుశా మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి కదా అప్పుడు తెలుస్తుంది ఆయన బండారం అని మండిపడ్డారు.

30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి ప్రజాదరణ తెచ్చుకున్న మా ఫ్యామిలీని టార్గెట్ చేసి 3 నెలల కింద వచ్చిన ఎంపీ భరత్ ఎదగాలనే ఇలా కుట్ర చేస్తున్నాడని.. మీడియాను వాడుకొని హైప్ తెచ్చుకున్నాడని జక్కంపూడి విమర్శించారు. ఎంపీ భరత్ యాటిట్యూడ్ వల్లే పార్టీ నష్టపోతుందని విమర్శించారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీ తిరిగి వచ్చిన ఈయన వల్ల పార్టీకి దెబ్బ తగులుతుందని అన్నారు. ఎంపీటీసీ ఫలితాల్లో అది పునరావృతమైందన్నారు.

బుచ్చయ్య చౌదరి, పెందుర్తి సహా టీడీపీ నేతలు, లాయర్లతో ఎంపీ భరత్ మీటింగులు పెడుతుంటాడని.. వారితో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాడని జక్కంపూడి విమర్శించారు. ఎన్నికలొచ్చాక అసలు కథ బయటపడుతుందని తెలిపారు.

ఓ భూస్కాంలోనే ఇద్దరి మధ్య గొడవకు కారణమైందని.. దాన్ని తాను నిలదీసినందుకే ఎంపీ భరత్ నన్ను టార్గెట్ చేశాడని ఎమ్మెల్యే జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైన ఒక గ్రామంలో మాక్ పోలింగ్ పెడితే ఎంపీ భరత్ కు అస్సలు ఓట్లు పడవని విమర్శించారు.

రాజమండ్రి నియోజకవర్గంలోని ఐదు నియోజకవర్గాల్లో ఎంపీ భరత్ ను రానీయకుండా ఎమ్మెల్యేలు నో ఎంట్రీ పెట్టారని.. మిగతా రెండు నియోజకవర్గాల్లోనే ఆయన సినిమా షో చేస్తాడని జక్కంపూడి విమర్శించారు. సినిమా వాళ్లలాగా తిరిగేస్తుంటాడని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పెట్టుకునేందుకే ఆయన డ్రామా అన్నారు.

ఎంపీ భరత్ ప్రత్యేకించి నిధులుతీసుకొచ్చి ఒక్క పని చూపించాలని జక్కంపూడి విమర్శించారు. కేవలం నిధులు ఇస్తాను రానీయడం లేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచం మీద నుంచి లేచి బ్రష్ చేసుకునేటప్పటి నుంచి పడుకునే దాకా ఎంపీ భరత్ ది యాక్టింగ్ అని తీవ్ర విమర్శలు చేశారు.

ప్రధానంగా తనకు , ఎంపీ భరత్ కు ఓ భూసమస్యపై వివాదం వచ్చిందని.. ఇక కార్యకర్తలు, నేతలు నియామకాల విషయంలో జెండా మోసిన వారిని పక్కనపెట్టి.. వారికి వ్యతిరేకులైన వారిని పార్టీలోకి తీసుకురావడం వల్లే తమ మధ్య గొడవలు మొదలయ్యాయని జక్కంపూడి పేర్కొన్నారు. వివాదానికి ఈ రెండు కారణాలని తెలిపారు. పురుషోత్తంపట్నం రైతులకు డబ్బులు ఇప్పించే ప్రయత్నంలో కొంత పర్సంటేజీలు తీసుకున్నాడనే విమర్శలున్నాయని.. దాన్ని నిలదీసినందుకు నాపై పడ్డాడని విమర్శించారు.

-ఎమ్మెల్యే జక్కంపూడి మాట్లాడిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇదీ


https://fb.watch/8bNO0S59J0/