Begin typing your search above and press return to search.
బాబుకు చెప్పే అలా మాట్లాడుతున్నావా జలీల్ ఖాన్?
By: Tupaki Desk | 1 May 2016 4:33 AM GMTకొమ్ములు తిరిగిన ఉస్తాద్ లాంటి నేతలు సైతం నోరు మూసుకొని ఉండటం.. మైకు కనిపిస్తే చాలు చెలరేగిపోయే నాయకులు సైతం నోరు మూసుకోవటం.. లేదంటే ఆచితూచి మాట్లాడుతున్న వేళ ఏపీ అధికారపక్షంలో ఇటీవల చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చెలరేగిపోయారు. మిగిలిన తమ్ముళ్లు ఎవరూ చేయలేని ఆసక్తికర వ్యాఖ్యను చేయటం గమనార్హం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసి చేశారో.. తెలియకుండా చేశారో కానీ.. జలీల్ ఖాన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యను విని విస్మయం చెందుతున్న తెలుగు తమ్ముళ్లు చాలామందే ఉన్నారు.
అంతలా షాకింగ్ ఇచ్చేలా జలీల్ ఖాన్ ఏం మాట్లాడారు? ఏ విషయం మీద ఆయన అంతలా చెలరేగిపోయారు? అన్న విషయానికి వస్తే.. ఏపీకి ప్రాణధారమైన ప్రత్యేక హోదా అంశంపై ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్ మాదిరే బీజేపీకి కూడా రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని తేల్చేసిన జలీల్ ఖాన్.. కేంద్రంలోని మంత్రి పదవిని వదులుకొని బయటకు రావటానికి టీడీపీకి రెండు నిమిషాలు కూడా పట్టదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటివరకూ ప్రత్యేక హోదా మీద కేంద్ర మంత్రులు ఏం మాట్లాడినా.. ఆచితూచి మాట్లాడటం.. జాగ్రత్తగా స్పందించటం.. కేంద్రం మీద తమకు నమ్మకం ఉందన్న నంగి మాటలు మాట్లాడే ఏపీ తెలుగు తమ్ముళ్లకు భిన్నంగా జలీల్ ఖాన్ చెలరేపోవటం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రం నుంచి బయటకు వస్తామన్న తొలి మాట జలీల్ ఖాన్ నోటి నుంచి రావటం గమనార్హం. మరి.. ఈ మాటను బాబుకు తెలిసే అన్నారో.. తెలియక చేశారా? అన్నది ఒక అంశమైతే.. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్షన్ ఏమిటన్నది జలీల్ ఖాన్ మరోమారు గళం విప్పితే అర్థమవుతుందంటున్నారు.