Begin typing your search above and press return to search.
హస్తం గుర్తుకు ఓటేసీ టీడీపీని గెలిపించాలట..
By: Tupaki Desk | 11 Aug 2017 4:53 PM GMTబీకాంలో ఫిజిక్స్ .. ప్రపంచ విద్యా చరిత్రలోనే కొత్త కాబినేషన్ పరిచయం చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా అలాంటిదే కొత్త కాంబినేషన్ ఒకటి సృష్టించి ఏపీ సీఎం చంద్రబాబుకు దడ పుట్టించారు. చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉప ఎన్నికలో ప్రచారానికి వెళ్లిన జలీల్ అక్కడ చెబుతున్న మాటలు విని చంద్రబాబు హడలిపోయారట. ఇంతకీ ఆయన ఏం చెప్పారో తెలిస్తే మీరు కూడా షాకవుతారు
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జలీల్ ఖాన్ టీడీపీ తరుఫున ప్రచారం కోసం నంద్యాల వెళ్లారు. ముఖ్యంగా నంద్యాలలో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ఆయన్ను పంపించారు. కానీ... అక్కడ టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి తరఫున ప్రచారం చేసిన ఆయన అభ్యర్థి పేరు కరెక్టుగానే చెప్పినా కూడా పార్టీ గుర్తు మాత్రం తప్పుగా చెప్పారు. హస్తం గుర్తుకు ఓటేసి భూమా బ్రహ్మానంద రెడ్డిని భారీ మెజారీటీతో గెలిపించాలని ఆయన ప్రచారం చేశారట.
నంద్యాలలో ఆయన ప్రచారం అత్యంత కామెడీగా ఉందని తెలుస్తోంది. అయితే... ఆయన చెబితే ఓట్లేస్తారో లేదో గానీ.. జలీల్ ఖాన్ అనగానే ”బీకాంలో ఫిజిక్`సా” అంటూ జనం చూసేందుకు వస్తున్నారట. దీంతో ఆయన ఊగిపోతూ ఏం మాట్లాడుతున్నానో కూడా తెలుసుకోకుండా ఎడాపెడా నోటికొచ్చింది మాట్లాడుతున్నారట. దీంతో జలీల్ ను కంట్రోల్ చేయాలటూ చంద్రబాబే స్వయంగా కర్నూలు టీడీపీ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది.