Begin typing your search above and press return to search.
తెలంగాణలో మైనస్.. ఏపీలో ప్లస్
By: Tupaki Desk | 11 Feb 2016 9:29 AM GMTతెలంగాణలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆరెస్ లో కలుస్తుంటే ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో వచ్చి చేరడానికి దారులు వేసుకుంటున్నారు. తెలంగాణలో నష్టపోతున్న టీడీపీ ఏపీలో మరింత బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. మంత్రి ఉమామహేశ్వర్ రావుతో కలిసి చంద్రబాబు నివాసానికి చేరుకున్న చేరుకున్న జలీల్ ఖాన్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇద్దరి భేటీలో ఏం మాట్లాడుకున్నారన్నది తెలియకపోయినా రాజకీయ భేటీయే అని తెలుస్తోంది.
అయితే... ఈ భేటీలో ఉన్న మంత్రి దేవినేని మాత్రం దీనిపై వేరేలా చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలు - విపక్ష ఎమ్మెల్యేలు అభివృద్ధివైపు చూస్తున్నారని మంత్రి అంటూ... అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకే ఎమ్మెల్యేలు చంద్రబాబును కలుస్తున్నారని అన్నారు. నియోజక వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో సమావేశమవుతున్నారని చెప్పారు. దాని ఉద్దేశం అభివృద్ధి పనుల కోసం చంద్రబాబును కలిశారనా...? లేదంటే అభివృద్ధి పనులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంలో చేరాలనా అన్నది తెలియాల్సి ఉంది. అయితే... వైసీపీ వర్గాలు మాత్రం జలీల్ ఖాన్ కొద్ది రోజులుగా పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారని... ఆయన టీడీపీలో చేరడం ఖాయమని అంటున్నారు. దీనిపై జలీల్ ఖాన్ కానీ, చంద్రబాబు కానీ, వైసీపీ ఖానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు.