Begin typing your search above and press return to search.
జలీల్ ఖాన్ కు కోపం తన్నుకొచ్చింది
By: Tupaki Desk | 16 March 2018 5:00 AM GMTజనసేన ఆవిర్భావ సభ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక కొందరు నేతలు కిందామీదా పడుతుంటే.. సూటిగా విమర్శలు.. ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఖండన ప్రకటన చేయటం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశారు.
ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా తమపై వచ్చిన ఆరోపణలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారే తప్పించి.. నువ్వు చేసిన ఆరోపణను నిరూపిస్తావా? సవాల్ అన్నోళ్లు చాలా తక్కువ మంది. అలాంటి వారిలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఒకరు. దుర్గగుడి పార్కింగ్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా పవన్ చేసిన ఆరోపణపై ఆయన రియాక్ట్ అయ్యారు.
తనపై చేసిన ఆరోపణ నిజమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
తనపైనా.. మంత్రి లోకేశ్ పైనా చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. పవన్ సభ ద్వారా హోదాపై గట్టి పోరాటం చేస్తారని ప్రజలంతా భావించారని. కానీ ఆయనేమో విషయాన్ని వదిలేసి లేనిపోని ఆరోపణలతో సభను ముగించారన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన హోదా గురించి పవన్ ఒక్క మాట అయినా మాట్లాడారా? అంటూ ప్రశ్నించిన జలీల్ ఖాన్.. హోదా ఇవ్వని మోడీని ప్రశ్నించలేదని.. నిలదీయలేదన్నారు. టీడీపీని గెలిపించినట్లుగా పవన్ మాట్లాడుతున్నారని.. జనసేన.. బీజేపీ అండ లేనప్పుడు కూడా తమ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. మరి.. అదే నిజమైతే.. తనకు మద్దతు పలకాలంటూ చంద్రబాబు పవన్ దగ్గరకు ఎందుకు వెళ్లినట్లు? అన్న ప్రశ్నకు జలీల్ ఖాన్ చెబితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.