Begin typing your search above and press return to search.
బీకాంలో ఫిజిక్స్.. సీనంతా రివర్స్
By: Tupaki Desk | 25 Feb 2019 3:30 PM GMTరాజకీయాల్లో ఎవరిపైనైనా కక్ష సాధించుకోవడం సులభమే కావొచ్చు. కానీ, ఆ కక్షలు రివర్సయినప్పుడే కష్టాలు మొదలవుతాయి. విజయవాడకు చెందిన ఎమ్మెల్యే, టీడీపీ నేత జలీల్ ఖాన్ కు ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఒకప్పుడు తాను చేసిన పనినే తన ప్రత్యర్థులు తనపై ప్రయోగించడంతో కక్కలేక, మింగలేక.. ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారాయన.
ఇక అసలు విషయానికొస్తే జలీల్ ఖాన్ కుమార్తె షబానాపై మతపెద్దలు సోమవారం ఫత్వా జారీ చేశారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని గుర్తు చేస్తూ వారీ ఫత్వా జారీచేశారు. ఇందుకు కారణం జలీల్ గతంలో చేసిన పనులేనని తెలుస్తోంది.
2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాజీ మేయర్ మల్లికా బేగం కాంగ్రెస్ పార్టీ తరఫున టిక్కెట్ దక్కించుకున్నారు. అదే సమయంలో ఆ టిక్కెట్ కోసం ప్రయత్నించిన జలీల్ ఖాన్ భంగపడ్డారు. దీంతో మతపెద్దలపై ఒత్తిడి చేసి మల్లికా బేగంపై జలీల్ ఖాన్ ఫత్వా జారీ చేయించారు.
ఈ ఫత్వా కారణంగా 2009లో టిక్కెట్ దక్కించుకున్నప్పటికీ మల్లికా బేగం ఓడిపోయారు. ఫత్వా కారణంగా తాను ఓటమి చెందినట్లుగా ఆమె అప్పట్లోనే ఆరోపించారు. ఇప్పుడు జలీల్ ఖాన్ తన కుమార్తె షబానాను ఎన్నికల బరిలో దించే ప్రయత్నం చేస్తుండడంతో విజయవాడ ముస్లిం నేతలంతా ఆయనకు బుద్ధి చెప్పాలని డిసైడైనట్లున్నారు. మల్లికాబేగం అప్పట్లో తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ.. పదేళ్ల క్రితం తనకు ఫత్వా జారీ చేశారని, ఇప్పుడు షబానాకు ఎందుకు జారీ చేయలేదని మల్లికా బేగం ప్రశ్నించారు. మత పెద్దలను ఆమె నిలదీశారు. ఈ ఫత్వా కారణంగా ఆనాడు ముస్లీంలు తనకు ఓటు వేయలేదని, జలీల్ ఖాన్ మతాన్ని అడ్డుపెట్టుకొని తనను ఓడించారని ఆమె ఆరోపిస్తున్నారు. తనను అప్పుడు రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేసిన జలీల్ ఖాన్ ఇప్పుడు తన కూతురును రాజకీయాల్లోకి ఎలా తెస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నాగుల్ మీరా వంటి నేతలూ అప్పట్లో జలీల్ ఖాన్ చేసిన పనిని గుర్తుచేయడంతో మతపెద్దలు షబానాపై ఫత్వా జారీ చేసినట్లు తెలుస్తోంది.
అయితే... బీకాంలో ఫిజిక్స్ చదివిన జలీల్ ఖాన్ తన తెలివంతా ఉపయోగించి ఈ ఫత్వా విషయంలో తనదైన వాదన వినిపిస్తున్నారు. అప్పట్లో మల్లికా బేగంపై ఫత్వా జారీ చేసిన విషయం నిజమేనని, కానీ అప్పుడు ఆమె ఆ ఫత్వాను గౌరవించలేదని ఆరోపించారు. ఫత్వాను పక్కన పెట్టి రాజకీయాలు చేసి పోటీ కూడా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తన కూతురును మల్లికా బేగం ఎలా ప్రశ్నిస్తోందని అడిగారు. ఇప్పుడు ఫత్వా ఇచ్చిన తమ పని మేం చేసుకుంటామని చెప్పారు. ఫత్వా జారీ చేసినా తన కుమార్తె పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సౌదీ లాంటి దేశాల్లోనే ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు.