Begin typing your search above and press return to search.
తమిళనాడు ఎందుకంత రగిలింది?
By: Tupaki Desk | 21 Jan 2017 5:18 PM GMTవ్యూస్ పెరిగి న్యూస్ తగ్గింది’.. జల్లికట్టు మీద పలువురి మాట. నిజమే.. జల్లికట్టు వివాదం మీద వార్తల కంటే.. విశ్లేషణలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కూతవేటు దూరంలో ఉన్న తమిళనాడు యావత్ రగిలిపోతున్న వేళ.. తమిళుడన్న ప్రతిఒక్కరూ తమ సంప్రదాయాన్ని.. సంస్కృతిని దెబ్బ కొడుతున్నారంటూ ఆక్రోశిస్తూ రోడ్ల మీదకు వచ్చిన వేళ.. తెలుగు టీవీ ఛానళ్లు ఆ ఆందోళనల్నికూసింత చూపిస్తున్నాయి. టీవీల్లో కనిపించిన దానికి తగ్గట్లే పేపర్లో మరింత వివరంగా వార్త ఉంటుందని ఆశిస్తున్న వారికి ఆశా భంగమే కలుగుతోంది. కాసింత ఫోటో.. దానికింద నామమాత్రంగా కనిపించే వివరాలు తప్పించి.. లోతుల్లోకి వెళుతున్న వారు ఎవరూ కనిపించటం లేదు.
జల్లికట్టు మంచిదా? చెడ్డదా? ఆ క్రీడపై విధించిన నిషేధానికి అనుకూలమా? వ్యతిరేకమా? లాంటివేమీ మేం ఇప్పుడు చేయదలుచుకోవటం లేదు. ఎందుకంటే.. ఆ పని ఇప్పటికే పలువురు పెద్ద ఎత్తున చేసేస్తున్నారు. అటు మీడియాలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ జల్లికట్టు మీద చాలామంది చాలా విశ్లేషణలు చేసేస్తున్నారు.అందుకే.. ఇప్పడా జోలికి వెళ్లటం లేదు.
ఎందుకంటే.. వాటిల్లో వాస్తవాల కంటే.. తమ ఉహలు.. అనుభూతులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ అంశంపై తమ వ్యూస్ చెప్పేందుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్న చాలామంది.. సగటు జీవికి వస్తున్న సందేహాలకు సమాధానాలు చెప్పటం లేదు. కేవలం తామేం అనుకుంటున్నారో మాత్రమే చెబుతున్నారు. అదే ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో మాకొక ప్రయత్నం చేయాలనిపించింది. ఈ ఉదంతంపై సగటు జీవికి వచ్చే కొన్ని సామాన్యమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనిపించింది. ఇందుకోసం ఊహల్ని.. విశ్లేషణల్ని పక్కన పెట్టి..వాస్తవాల మీద దృష్టి పెట్టాం. ఇందుకోసం తమిళనాడుకు చెందిన కొందరు మీడియా మిత్రులతో మాట్లాడటం జరిగింది.
అయితే.. వీళ్లంతా ఎలాంటి వారన్నది పెద్ద ప్రశ్న. ఈ రోజుల్లో విషయం ఏదైనా.. జట్లు మాత్రం రెండు ఉంటాయి. కానీ.. మేం ఎంపిక చేసుకున్న వారంతా.. విషయాన్ని విషయంగా చెప్పే వారే. వార్తా శోధనలో సామాజిక అంశాల్ని జాగ్రత్తగా గుర్తించటం.. సమస్య మూలాల్ని ప్రపంచానికి చెప్పాలన్న తపన ఉన్న వారు. ఇంతకీ వారేం చెప్పారు అన్న దానిలోకి వెళ్లే ముందు.. మాకొచ్చిన సందేహాల్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాం.
ఒక మూగ జంతువు పట్ల మనిషి కర్కసంగా వ్యవహరించటం ఏమిటి? ఆధునిక కాలంలో జల్లికట్టు అమానుషం కాదా? జల్లికట్టుతో సగటుతమిళుడికి ఉన్న అనుబంధం ఎలాంటిది? తమిళుడి జీవితంలో జల్లికట్టు పాత్ర ఏమిటి? న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని జల్లికట్టును నిషేదం విధించిన వెంటనే తమిళులు ఎందుకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు? తమిళ గ్రామీణ ప్రాంతాల్లో ఆడే జల్లికట్టుపై విధించిన నిషేదంపై నగరవాసి ఎందుకంత ఘాటుగా రియాక్ట్ అయ్యాడు? ఎవరి నేతృత్వం లేకుండా రోజుల తరబడి.. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా మెరీనా బీచ్ లో వేలాది మంది ఎందుకు ఆందోళన చేస్తున్నారు? సినీ నటులు..వివిధ వర్గాల ప్రముఖలంతా జల్లికట్టుకు మద్దతుగా ఎందుకు గొంతు విప్పుతున్నారు? ఏదైనా రాజకీయం అంశం.. వివాదాస్పద అంశంపై తెలుగు సినీ నటులు పెద్దగా రియాక్ట్ కావటానికి ఇష్టపడని వేళ.. తమిళ నటులేకాదు.. పరిశ్రమ యావత్తు తమిళులకు అండగా నిలవటం ఏమిటి? ఏఆర్ రహమాన్ లాంటి అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఒక సంగీత దర్శకుడు..జల్లికట్టు ఎపిసోడ్ లో నిరాహారదీక్ష చేయటం ఏమిటి? ఆయన ముస్లిం మతాన్ని స్వీకరించారని మర్చిపోకూడదు. ఒక ముస్లిం హిందువుల సంప్రదాయానికి ఎందుకంత అండగా నిలిచారు? తమిళుల్ని ఏకం చేసిందేమిటి? తమిళనాడు ఎందుకింత రగిలిపోతోంది? లాంటి చాలానే ప్రశ్నల్ని సంధించటం జరిగింది.
ప్రశ్నలు అయిపోయాయి. సమాధానాలు ఒక్కొక్కటిగా చెప్పేయటమే మిగిలింది. జల్లికట్టు ఆటను చూస్తే.. ఎద్దును కొందరు లొంగదీసుకోవటమే ఇందులో కీలకం. ఈ క్రమంలో దాని కొమ్ములు వంచటమో.. దాన్ని తమకు తగ్గట్లుగా బలవంతంగా లొంగదీసుకోవటం.. అందులో భాగంగా దాని తోకను పట్టుకోవటమో.. ఇతర భాగాలపై బల ప్రయోగం చేయటం. ఇదొక ఆటగానే తమిళులు చూస్తారు. ఇంకా చెప్పాలంటే.. వారి జీవనంలో అదొక భాగం. చికెన్ తినేవాడికి కోడిని చంపటం తప్పగా ఉండదు? మేక మాంసం తినే వాడికి మేక గింజుకుంటున్నా.. వాడిగా ఉంటే కత్తితో నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు.ఈ క్రమంలో కత్తి దాని మెడ మీద పడిన వెంటనే.. విలవిలాడుతుంది. అంతదాకా ఎందుకు.. తనను కాసేపట్లో చంపేస్తారన్న విషయాన్ని అది ఇట్టే గుర్తిస్తుంది. ఆ మాటకు వస్తే ఫారంలో అదే పనిగా తిండి పెడుతూ.. దాని మాంసమే లక్ష్యంగా పెంచే ఫారం కోళ్లు సైతం కత్తితో కోసే ముందు విలవిలలాడతాయి.
హింస అన్నదే లెక్కలోకి తీసుకున్నప్పుడు.. ప్రతిది హింసే. ఆ మాటకు వస్తే జల్లికట్టు కూడా హింసే. ఆ మాటలో వేరే మాట లేదు. కాకుంటే.. పొద్దున.. సాయంత్రం అన్న తేడా లేకుండా నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరూ జల్లికట్టు మించిన దుర్మార్గమైన క్రీడ మరొకటి లేదంటూ లెక్చర్లు ఇచ్చేయటం కనిపిస్తుంది. కానీ.. తమిళులకు జల్లికట్టు ఏడాదిలో ఒకసారి ఆడేక్రీడగానే చూస్తారు. అందుకోసం ఏడాది పొడవునా.. ఆ ఆట కోసం దాన్ని సిద్ధం చేస్తుంటారు. ఇక్కడో వాస్తవం చెప్పాలి. ఇప్పుడు లేదు కానీ..ఓ యాభై ఏళ్ల కిందట.. దక్షిణ తమిళనాడులోని కొన్ని గ్రామాల్లోజల్లికట్టులోకి దిగి..ఒక్క ఎద్దునైనా అణిచిన వాడికే తమ ఆడపిల్లను ఇచ్చేందుకు ఇష్టపడేవారు. పెళ్లికి అదో ల్యాండ్ మార్క్ లా ఉండేది.
తమిళుడికి.. ఎద్దుకు మధ్యన అవినాభావ సంబంధం ఉంది. దాంతో వ్యవసాయం చేస్తాడు. దాన్ని తన కుటుంబంలో భాగంగా చూసుకుంటాడు. తానుపెంచే ఎద్దుల్లో పౌరుషం.. పొగరు ఉండే వాటిని ప్రత్యేకంగా ఎంపిక చేసి మరీ పెంచుతారు. ఇక్కడ తెలుగువారికి సుపరిచితమైన కోళ్ల పందాల్ని ప్రస్తావిస్తే విషయం మరింత బాగా అర్థమవుతుంది. పందెంకోళ్లను అన్ని కోళ్లను వాడరన్నది తెలిసిందే. దాని కోసం ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న వాటిని మాత్రమే వినియోగిస్తారు. ఇలాంటి పందెం కోళ్లను చంపుకునేందుకు అస్సలు ఇష్టపడరు. దీంతో డబ్బులుసంపాదించటం తర్వాత.. తమ ఇంటి పరువుకు అదొక చిహ్నంగా భావించే వారుచాలామంది కనిపిస్తారు. వాటిని పందేనికి సిద్ధం చేసేందుకు విపరీతంగా శ్రమిస్తారు. ఇందుకు తగ్గట్లే.. ఈ పందెం కోళ్లు.. మిగిలిన కోళ్లకు భిన్నంగా వ్యవహరిస్తుంటాయన్నది మర్చిపోకూడదు.
ఇక.. జల్లికట్టు ఆటలో ఎద్దుల పరిస్థితి కూడా ఇలాంటిదే. ఏడాదిలో ఒక్కసారి ఆట కోసం ఉపయోగించే కొన్ని ఎద్దుల్ని ప్రత్యేకంగా పెంచుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకజాతి ఎద్దుల్ని ఎంపిక చేస్తుంటారు. తరతరాల నుంచి తమకు వస్తున్న సంప్రదాయాన్ని ఈ ఆటలో చూస్తారే తప్పించి.. ఆ ఎద్దును హింసించటంకోసం పెంచరు. ఇక.. జల్లికట్టును తమిళులు ఎందుకంత బలంగా కోరుకుంటున్నారంటే.. ఈ క్రీడకోసం ప్రత్యేక జాతి ఎద్దుల్ని వినియోగిస్తున్నారని చెప్పాం కదా. వాటి ఉనికి రోజురోజుకి తగ్గుతుంది. ఎందుకంటే..ప్రాశ్చాత్యదేశాల పశువుల వీర్యాన్ని.. స్థానిక ఎద్దులతో క్రాస్ చేయించి.. వ్యవసాయ అవసరాలకు సరిపడా ఎద్దుల్నిసృష్టించే పని.. ఒక పరిశ్రమలా సాగుతోంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇదెలా తయారైందంటే..తమదైన జాతి ఎద్దులు కనిపించకుండా పోయే పరిస్థితి. అంటే.. తమిళుల ప్రాణపదంగా భావించే తమ ఐడెంటికి క్రైసిస్ తగ్గుతున్న స్వజాతి ఎద్దుల విషయంలోనూ వారికి ఆందోళన ఉంది.
పైకి వారు ఎక్స్ ప్రెస్ చేయలేరు కానీ.. వారి మాటల్లో అర్థమయ్యేదేమిటంటే.. ఇప్పటికే గ్రామీణ ముఖచిత్రం దాదాపుగా చిధ్రమైందని.. జల్లికట్టుకు ఉపయోగించే ఎద్దుల్ని కనుమరుగు చేసేందుకు విదేశీ కంపెనీల కుట్రలో భాగమే జల్లికట్టుపై బ్యాన్ పోరాటమని కూడా చెబుతుంటారు. జల్లికట్టు క్రీడను ఎద్దుల్ని లొంగదీసుకునేందుకు.. తమదైన రాక్షసానందం కోసం తమిళులు ఆరాటపడుతున్నారంటూ విపరీత వ్యాఖ్యలు చేసే వారికి.. సున్నితమైన వారి ఐడెంటిటీ క్రైసిస్ ను గుర్తించే అవకాశం చాలా.. చాలా తక్కువ.
మరి.. గ్రామీణ తమిళుల అంతరాల్లోఉన్న ఈ భావన నగరాల్లోని తమిళులకు ఎలా ట్రాన్సఫర్ అయ్యింది? వారి బతుక్కి.. వీరి బతుక్కి సంబంధం లేదు కదా? అన్న సందేహం చాలామందిలో వస్తుంది. కానీ.. నగరవాసి మూలం గ్రామీణమేగా. గ్రామం ఏడుస్తోందంటే.. ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా అయినా నగరంలో ఉన్న వ్యక్తి వేదన చెందకుండా ఉంటాడా? భావోద్వేగాలు ఎక్కువగా ఉండే తమిళుల్లో.. ఈ అసంతృప్తి పాళ్లు ఎంతలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే.. తమదైన ఆటను నిషేధించటంపైతమిళుడు భగ్గుమంటున్నాడు.
జంతు హింస గురించి మాట్లాడే వారంతా.. తాము ఉపయోగించే సౌందర్య లేపనాల కోసం జంతువుల్ని ఎంత దారుణంగా హింసిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. జంతుహింస గురించి మాట్లాడేవారు.. పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చే వారు..పలు దేశాల్లో జరిగే అనాగరికమైన క్రీడల గురించి మాట్లాడరే? అన్నది వారి ప్రశ్న. పెటా లాంటి అంతర్జాతీయసంస్థలు బుల్ ఫైట్ మొదలు చైనా.. జపాన్.. యూరప్ లోని పలు దేశాల్లో నిర్వహించే స్థానిక సంప్రదాయ క్రీడలపై ఎందుకు దృష్టి సారించవు? కొన్ని దేశాల సుప్రీంకోర్టులు తమ సంప్రదాయంలో భాగమైన క్రీడల్ని నిషేదించమని తేల్చిచెప్పినప్పుడు మౌనంగా ఉండటం నిజం కాదా? అన్న ప్రశ్నలు తమిళులు సంధిస్తుంటారు.
ఏ ప్రముఖుడు పిలుపు ఇవ్వకుండానే మెరీనా బీచ్ లో ఇప్పుడు సముద్ర అలల కంటే జనసంద్రం చేస్తున్న ఉద్యమ కెరటాలే ఎందుకు ఉవ్వెత్తున విరుచుకుపడుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. తమ మూలాల్ని.. తమ సంప్రదాయాల్ని విపరీతంగా ప్రేమించి..ఆరాధించే తమిళులకు.. తమ ఉనికిని దెబ్బ తీసే కుట్రజరుగుతుందన్న సందేహం చాలా బలంగా వారి మనసుల్లో నాటుకుపోవటమే. జల్లికట్టుపై నిషేదం అలాంటి కుట్రల్లో భాగమని వారు సంపూర్ణంగా నమ్మటమే.
తెలుగునాట ఏదైనా ప్రజాఉద్యమం జరిగినా.. సామాజిక అంశాలకు సంబంధించిన అంశాల మీద సినీతారలు స్పందించటం తక్కువగా ఉంటుంది. సరిగ్గా చూస్తే.. తెలుగోడి ఆత్మగౌరవం అన్న మాటను ఎన్టీఆర్ వెలికి తీసి నినదించే వరకూ తెలుగోడు ఎలా ఉన్నాడో తెలిసిందే. ఎన్టీఆర్ వినిపించిన తెలుగువాడి ఆత్మగౌరవ నినాదాన్ని ఆయనమాదిరి సంపూర్ణంగా నమ్మి..ఆచరించటమే కాదు.. అందుకోసం ఎంతకైనా సిద్ధమనేలా వ్యవహరించే ఆత్మాభిమానధనుడు తెలుగునేల మీద ఎవరున్నారు? కానీ.. తమిళనాట అందుకు భిన్నమైనపరిస్థితి. ఎంజీఆర్ మొదలు నిన్నటి జయలలిత వరకూ సినీ నటులే కాదు.. ఇప్పటి విశాల్.. సూర్య.. రజనీకాంత్..కమలహాస్ లాంటోళ్లు ఎందరో తమిళుల సంప్రదాయం పట్ల వారువిపరీతమైన కమిట్ మెంట్ నుప్రదర్శించారు.తమిళ ప్రజల కోసం.. వారి వాణిని తమ వాణిగా వినిపించేందుకు ఎన్నడూవెను కాడరు. తమ వారి గురించి మాట్లాడటానికి.. సామాజిక అంశాల మీద స్పందించటానికి వారు తహతహలాడుతుంటారు.
చెన్నై మహానగరం వరదల్లో మునిగిపోయినప్పుడు తమిళ సినీ హీరోలు పనోళ్ల మాదిరి మారి.. ఎంతలా కష్టపడింది చూశాం. కానీ.. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికే వద్దాం.. హైదరాబాద్ లో మొన్నటి భారీ వర్షాలకు ఎన్నో కాలనీలు దారుణంగా నీళ్లతో పోటెత్తటమే కాదు.. రోజుల తరబడికష్టాలు పడ్డారు. ఎవరైనా ముందుకొచ్చారా? చెమటలుచిందింది సాటి హైదరాబాదీల కోసం శ్రమించారా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకిలా అంటే.. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు.. ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సింది రాజకీయ నాయకుల పనిగా వారు భావిస్తుంటారు. తమకు సంబంధం లేని వ్యవహారంగా ఫీలవుతారు. లారెన్స్ లాంటి నృత్య దర్శకుడు మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న వారి భోజనాల కోసం కోటి రూపాయిల విరాళాన్ని ప్రకటించటం చూస్తే.. తెలుగు ప్రజలపై ప్రకృతి కత్తి కట్టినప్పుడు.. చాలా ధర్మంగా రూ.10లక్షలు.. రూ.15 లక్షలు.. రూ.20 లక్షల విరాళాలు ప్రకటించే పే..ద్ద మనసులు మనకు కనిపిస్తాయి. పదుల కోట్లు తీసుకునే నటుడు సైతం విరాళాన్ని తన తోటివారికి సాయంగా కాకుండా.. తన పేరు మిస్ కాకుండా చూసుకోవటానికే ప్రాధాన్యత ఇస్తారన్నది అస్సలు మర్చిపోకూడదు.
దీనికి పూర్తి భిన్నంగా ఉంటారు తమిళ సినీ నటులు. ఇక్కడ ఆసక్తికరమైన వాస్తవం ఒకటి చెప్పాలి. విశాల్.. రజనీకాంత్ లు జన్మత: తమిళులు కారు. వారికి తమిళ మూలాలు అస్సల్లేవు. కానీ.. తమిళుడి వేదనను తమ వేదనగా వారు ఫీలవుతారు. ఇందుకు మరో ఉదాహరణ చెప్పాలి. సంగీతం తప్పించి మరేమీ పట్టించుకోనట్లుగా తనదైనప్రపంచంలో మునిగి తేలే ఏఆర్ రెహమాన్ లాంటి ఇంటర్నేషనల్ ఐకాన్ జల్లికట్టు (వర్మ లాంటోళ్ల మాటల్లో అయితే అమాయక జంతువులపై రాక్షసానందం పొందేవారు) పై విధించిన నిషేదానికి నిరాహార దీక్ష చేయటం ఏమిటి? అసలు ఊహించగలమా?
ఎందుకిలా అంటే.. తమిళులంతా ఒక్క తాటి మీదే ఉంటారు. వారి గుండె చప్పుడు మిగిలిన వారికి కాస్త భిన్నం. కులం.. మతం.. ప్రాంతం.. ఇలాంటి పంచాయితీలు రోజూ ఉన్నా.. లెక్క తేడా వచ్చినప్పుడు.. తమదైన సంప్రదాయాన్ని.. సంస్కృతిని ఎవరు ప్రశ్నించినా.. ధర్మం చెబుతామన్న పేరుతో పెద్దరికపు పాత్ర పోషించటాన్ని వారు అస్సలు తట్టుకోలేరు. ఎందుకంటే.. వారికి వారి జాతి మీదున్న ప్రేమ అలాంటిది. తమిళుడికి తన ఆత్మాభిమానం ముందు మరేదైనా దిగదుడుపే. వారికి వారి లోకంలో బతకమే ఇష్టం. విలువలు నేర్పే ప్రాశ్చత్యం.. కాలం తెచ్చే మార్పుల్ని వారు ఆహ్వానిస్తారు కానీ.. తమ మూలాల్ని ప్రశ్నించే వరకూ వెళితే మాత్రం.. ఎంతకైనా రెఢీ అంటారు. అందుకే.. జల్లికట్టు మీద బ్యాన్ అన్న మాట వినిపిస్తే చాలు.. తమిళుడు తాట తీస్తామంటారు. అమ్మ లాంటి సంస్కృతిని అమితంగా ఆరాధించే వాడికి.. అమ్మను అవమానించే మాట నోటి వెంట వస్తే ఆవేశం తన్నుకు రాకుండా ఉంటుందా?
--- గరుడ
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/