Begin typing your search above and press return to search.
ఆ పరిస్థితి చూశాకే... ‘జమిలి’పై నిర్ణయం!
By: Tupaki Desk | 14 May 2018 10:33 AM GMTదేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు జమిలి ఎన్నికల రూపంలో జరుగుతాయా? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు - పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు జరుగుతోందా? అంటే ఇందుకు భిన్నమైన సమాధానాలు వినిపిస్తాయి. జమిలి ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించడానికి సిద్ధం అని ఎన్నికలన సంఘం ఎన్నడో ప్రకటించేసింది. కానీ మోడీ సర్కారు దీని మీద రాజకీయ నిర్ణయమే తీసుకోవాల్సి ఉంది. అయితే రాజకీయంగా ఉన్న పరిస్థితులను బేరీజు వేసినప్పుడు... 2019 సార్వత్రిక ఎన్నికలను జమిలి విధానంలో నిర్వహించడానికి భాజపా సర్కారు సాహసించకపోవచ్చుననే వాదన వినిపిస్తోంది.
విషయం ఏంటంటే.. షెడ్యూలు ప్రకారం అయితే.. ఈ ఏడాది చివర్లో మూడు భాజపా పాలిత రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్ - రాజస్తాన్ - ఛత్తీస్ గఢ్ లలో ప్రస్తుతం భాజపానే రాజ్యం చేస్తోంది. ఆ మూడు రాష్ట్రాలు ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. అయితే ఈ మూడు చోట్ల కూడా భాజపా తిరిగి విజయకేతనం ఎగురవేయడం ఖరారు అనిపించే పరిస్థితి ఉంటే గనుక.. వారు జమిలి ఎన్నికలకు వెళ్లకపోవచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో.. ఈ మూడు రాష్ట్రాల ఫలితం తమకు అనుకూలంగా ఉండదని అనుకునేట్లయితే... జమిలి ఎన్నికలకు పిలుపు ఇవ్వవచ్చు. ఏది ఏమైనప్పటికీ.. జమిలి ఎన్నికలకు అనుకూల నిర్ణయం తీసుకుంటున్న మోడీ సర్కారు.. తమ పార్టీకి రాజకీయంగా పాజిటివ్ గా ఉండే దిశగానే పావులు కదుపుతుందని అంతా అనుకుంటున్నారు.
మరో కోణంలోంచి చూసినప్పుడు.. కొన్ని నెలల కిందట భాజపా జాతీయ సారథి అమిత్ షా - భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అమిత్ షా వారితో జమిలి ఎన్నికలో ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఉండవనే సంగతి చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ భాజపా ఆ పద్ధతి గురించి తీసుకోబోయే నిర్ణయం వారి రాజకీయ ప్రయోజనాలకు ముడిపడి మాత్రమే ఉంటుంది. పైగా ఇలాటి నిర్ణయం తీసుకునేప్పుడు రాష్ట్రాల అసెంబ్లీలు కూడా దానిని ఆమోదించాల్సి వస్తే గనుక... మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. కనుక ఏ రకంగా చూసినా, ఎన్నికల సంఘం అధికారులు.. తాము జమిలి ఎన్నికలకు సిద్ధం అని ఎన్నిసార్లు ప్రకటించినా.. 2019లో అది సాధ్యం కాకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు.