Begin typing your search above and press return to search.
వైఎస్ కుటుంబం పేరు చెబితే పనులు చేయను: వైసీపీ ఎమ్మెల్యే!
By: Tupaki Desk | 25 Aug 2020 1:30 PM GMTఏపీ సీఎం జగన్ సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో వైసీపీ ఫుల్ క్లీన్ స్వీప్ చేసేసింది. మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. కానీ మంత్రి పదవుల్లో ఉపముఖ్యమంత్రి పదవిని ముస్లిం వర్గానికి ఇచ్చారు. దీంతో మిగతా వర్గాలన్నీ ఖిన్నుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇటీవల సీఎం జగన్.. జమ్మలమడుగుకు చెందిన టీడీపీ మాజీ మంత్రి అయిన రామసుబ్బారెడ్డిని వైసీపీలోకి తీసుకొని ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు సమాచారం. జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతిలో అసెంబ్లీ ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఓడిపోయాడు. అలాంటి రామసుబ్బారెడ్డిని జగన్ పార్టీలో చేర్చుకోవడాన్ని సుధీర్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. సుధీర్ రెడ్డి వ్యతిరేకించినా రామసుబ్బారెడ్డిని తీసుకోవడం.. ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆఫీసు తెరిచి ఫుల్ హవా నడిపిస్తుండడంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన అనుచరులు రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా రామసుబ్బారెడ్డి పెత్తనం సాగుతోందని.. అంతా పాత టీడీపీ వాళ్లకే జిల్లాలో.. నియోజకవర్గంలో పనులు, కాంట్రాక్టులు దక్కుతున్నాయని సుధీర్ రెడ్డి, అనుచర వర్గం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. రామసుబ్బారెడ్డి అసలైన వైసీపీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని నేతలు మండిపడుతున్నారట..
ఈ క్రమంలోనే సుధీర్ రెడ్డి, ఆయన అనుచరవర్గం వైసీపీ అధిష్టానంపై.. జగన్ పై ఆగ్రహంగా ఉన్నారట.. ఎవరైనా తన దగ్గర జగన్ గురించి.. వైసీపీ పేరు ఎత్తితే కోపంతో చూస్తున్నారట అని ప్రచారం జరుగుతోంది.. వైఎస్ కుటుంబం పేరు చెబితే పనులు చేయను అని తెగేసి చెబుతున్నాడట.. తాను 50వేలకు పైగా మెజార్టీతో గెలిచానని.. జగన్ గాలిలో అంత మెజార్టీ వస్తుందా? అని చీదరించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తనకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా వేరే పార్టీ నుంచి పోటీచేసి గెలుస్తానని చెబుతున్నాడట..
ఇక జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డికి, సుధీర్ రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చాలని అధిష్టానం ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడడం లేదట.. ఇప్పుడిదే జమ్మలమడుగులో ఎవరి నోటా విన్నా వినిపిస్తోందట. సోషల్ మీడియాలోనూ సుధీర్ రెడ్డి వ్యవహారం విస్తృతంగా ప్రచారమవుతోందని తెలిసింది.