Begin typing your search above and press return to search.

కశ్మీర్ పర్యాటకం.. కేంద్రం కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   10 Oct 2019 9:52 AM GMT
కశ్మీర్ పర్యాటకం.. కేంద్రం కీలక ప్రకటన
X
ఆగస్టు నుంచి నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ కు ఇప్పుడిప్పుడే స్వేచ్ఛ లభిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ లోని ఆంక్షలను ఒకదాని తర్వాత ఒకటి ఎత్తివేస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గురువారం నుంచి కశ్మీర్ లో పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించారు.

ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన నేపథ్యంలో రెండు నెలల క్రితం ఆగస్టు 2న పర్యాటకులు, కశ్మీర్ లోని ఇతర రాష్ట్రాల వారిని, విద్యార్థులను కశ్మీర్ వదిలి వెళ్లిపోవాలని కేంద్రం అల్టీమేటం జారీ చేసింది. ఆ తర్వాత రెండు రోజులకే కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ ను విభజించింది. కశ్మీర్ ను నిర్భంధంలోకి తీసుకుంది.

అప్పటి నుంచి నిషేధాజ్ఞలతో కశ్మీర్ అందాలను తిలకించే భాగ్యం దేశ, విదేశీ పర్యాటకులు కోల్పోయారు. ప్రధానంగా కశ్మీర్ లో కశ్మీర్ లోయ ప్రకృతి అందాలను చూడడానికి చాలా మంది వస్తుంటారు. పర్యాటకమే స్థానికులకు, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోంది. అరవై రోజుల నుంచి పనిలేక ఖాళీగా ఉంటున్న స్థానికులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం తాజాగా కశ్మీర్ పర్యాటకానికి దారులు తెరించింది.

తాజాగా కశ్మీర్ లోయ భద్రతపై ప్రతీరోజు గవర్నర్ సత్యపాల్ మాలిక్ సమీక్షలు నిర్వహిస్తూ కేంద్రానికి నివేదికలు పంపిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడడంతో పర్యాటకానికి పచ్చాజెండా ఊపారు.