Begin typing your search above and press return to search.
బీజేపీ మెనిఫెస్టో.. ఆ అంశంపై దుమారం!
By: Tupaki Desk | 9 April 2019 6:02 AM GMTభారతీయ జనతా పార్టీ మెనిఫెస్టోలో ఒక అంశం దుమారం రేపుతూ ఉంది. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు మెనిఫెస్టోలో అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఉంటాయి. అదే రీతిన బీజేపీ వాళ్లు కూడా తమ రొటీన్ అంశాలను ప్రస్తావించారు. ఇక యథాతథంగా కొన్ని ‘జాతీయ వాద’ అంశాలను బీజేపీ తన దైన రీతిలో ప్రస్తావించింది. వీటిలో రామమందిర నిర్మాణం ఒకటి.
ఇది కొత్తదీ ఏమీ కాదు. దశాబ్దాలుగా బీజేపీ వాళ్లు చెబుతున్నదే. తమకు అధికారం దక్కితే అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే మాటను బీజేపీ వాళ్లు ప్రతి ఎన్నికల ముందూ చెబుతూ ఉంటుంది. గత ఎన్నికల ముందు కూడా అదే మాటే చెప్పింది. ఇప్పుడు కూడా అదే మాట చెబుతోంది కమలం పార్టీ.
ఆ సంగతలా ఉంటే.. ఈ సారి ఆర్టికల్ 370 రద్దు అని కూడా తన మెనిఫెస్టోలో ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెన్టీ గురించి బీజేపీ మెనిఫెస్టోలో ప్రస్తావించింది. అలాగే జమ్మూ కాశ్మీర్ లో బయటి వాళ్లు ఆస్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం లేకుండా చేస్తున్న ఆర్టికల్ 35 ఏ ను కూడా రద్దు చేస్తామని కమలం పార్టీ తమ మెనిఫెస్టోలో పేర్కొంది. తద్వారా కశ్మీర్ విషయంలో జాతీయ వాదాన్ని రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.
అయితే ఆర్టికల్ రద్దు విషయంలో బీజేపీ వాదన కొత్తది ఏమీ కాదు. ఆ ఆర్టికల్ ను రద్దు చేయాలని గతంలో బీజేపీ డిమాండ్ చేసేది. అయితే గత ఐదేళ్లలో అధికారం చేతిలో ఉన్నా బీజేపీ ఆ పని చేయలేకపోయింది. పై పెచ్చూ కశ్మీర్ లో ఆ ఆర్టికల్ ను సమర్థించే వారితో కొన్నాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే ఈ సారి ఎన్నికల మెనిఫెస్టోలో మళ్లీ కమలం పార్టీ ఆర్టికల్ రద్దుకు తాము కట్టుబడి ఉన్నట్టుగా ప్రకటించుకోవడం విశేషం!
ఇక ఆర్టికల్ 370 ని రద్దు చేస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీపై ఫరూక్ అబ్ధుల్లా,ధ్వజమెత్తారు. ఆ ఆర్టికల్ జోలికి రావొద్దని అన్నారు. మెహబూబాబ ముఫ్తీ కూడా అదే మాటే అన్నారు.