Begin typing your search above and press return to search.
జానాసాబ్.. కేసీఆర్ వి బఫూన్ చర్యలా..?
By: Tupaki Desk | 7 Sep 2018 8:33 AM GMTఎక్కాల్సిన రైలు జీవితం కాలం లేటు అన్నట్లుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల తీరు. ఓపక్క ముందస్తు ఎన్నికలంటూ కేసీఆర్ ఒకటి తర్వాత ఒకటిగా నిర్ణయాలు తీసుకొని విపక్షాల కంటే రేసులో దూసుకెళుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తాపీగా గొంతు సవరించుకొని కేసీఆర్ పై విమర్శలు చేసేందుకు రెఢీ అవుతున్నారు.
నెహ్రు.. ఇందిర మొదలుకొని రాహుల్ వరకూ ఎవరిని విడిచిపెట్టకుండా మాటలతో ఆట ఆడుకున్న కేసీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడేందుకు కాంగ్రెస్‌నేతల్లో సమరోత్సాహం పెద్దగా కనిపించటం లేదన్న మాట వినిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ పెద్దమనిషిగా అభివర్ణించే జానారెడ్డి సైతం రోజు తర్వాత కేసీఆర్ తీరుపై నోరు విప్పారు. తన పాలనా వైఫల్యాల్నికప్పిపుచ్చుకోవటం కోసమే తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్లినట్లుగా ఆయన చెబుతున్నారు.
తెలంగాణలో రాజకీయ అనిశ్చితి ఎక్కడ ఉందని ప్రశ్నించిన జానా.. రాష్ట్రంలో రాజకీయ కలుషితానికి కేసీఆరే కారణమన్నారు. కేసీఆర్ తీరుతో ప్రజాస్వామ్యానికి చేటుగా ఆయన మండిపడ్డారు. అసలు ప్రజాస్వామ్యంపై కేసీఆర్ కు నమ్మకం ఉందా? అని ప్రశ్నించిన జానా.. కేసీఆర్ వి బఫూన్ చర్యలుగా మండిపడ్డారు.
అందితే జుట్లు.. అందకుంటే కాళ్లు పట్టుకునే తత్త్వం కేసీఆర్ దన్న ఆయన.. రానున్న ఎన్నికల్లో ఆయనకు తెలంగాణ ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రు కుటుంబంపైకేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతా బాగానే ఉంది కానీ జానాసాబ్.. కేసీఆర్ లాంటి అధినేతను ఉద్దేశించి.. బఫూన్ అంటూ కెలికితే మీ మీద విరుచుకుపడటమే కాదు.. మాటలతో ఉతికి ఆరేస్తారు? ఆ విషయాన్ని గుర్తు పెట్టుకునే బఫూన్ అన్న మాటను వాడారా జానాసాబ్?