Begin typing your search above and press return to search.

జోస్యంః కేసీఆర్‌ కు ద‌స‌రా త‌ర్వాత క‌ష్టాలేన‌ట‌

By:  Tupaki Desk   |   9 Oct 2016 10:30 AM GMT
జోస్యంః కేసీఆర్‌ కు ద‌స‌రా త‌ర్వాత క‌ష్టాలేన‌ట‌
X
వివిధ పార్టీల నుంచి ఎంపీలు - ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఫిరాయించడంపై పోరాటం చేస్తున్న‌ కాంగ్రెస్ పార్టీ త‌మ పోరులో ముంద‌డుగు ప‌డింద‌ని చెప్తోంది. కాంగ్రెస్‌ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌ పీ) ద్వారా ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 19న సుప్రీం కోర్టు విచారించనుంద‌ని కాంగ్రెస్ నేత‌లు వెల్ల‌డిస్తున్నారు.ద‌స‌రా పండుగ త‌ర్వాత స‌రిగ్గా వారానికి జ‌రిగే ఈ విచార‌ణ‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ క‌ష్టాల‌ప‌డ‌టం ఖాయ‌మని చెప్తున్నారు. సుప్రీం కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించ‌డం అంటే టీఆర్ ఎస్ చిక్కులు ప్రారంభం అయిన‌ట్లేన‌ని వాదిస్తున్నారు.

కాంగ్రెస్ వాద‌న ప్ర‌కారం తెలంగాణ‌లో టీఆర్‌ ఎస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 47 మంది ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరారు. వీరిలో 25 మంది ఎమ్మెల్యేలు - 18 మంది ఎమ్మెల్సీలు - నలుగురు ఎంపీలు ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు - కాంగ్రెస్ నుంచి ఏడుగురు - వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ముగ్గురు - బిఎస్‌ పి - సిపిఐ నుంచి ఒక్కొక్కరు టిఆర్‌ ఎస్‌ లో చేరారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనా చారికి ఇదివరకే నోటీసు పంపించింది. కౌన్సిల్‌ లో ఉన్న తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీలు టీఆర్‌ ఎస్‌ లో చేరారని, టీడీపీ ఆ పార్టీలో విలీనమైందని లెజిస్లేచర్ కార్యదర్శి బులెటిన్ విడుదల చేశారంటూ ఆ పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో తాము చేసిన విన్నపంపై సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించి ఈ నెల 19న విచారణకు చేపట్టిందని కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టులో అనర్హత పిటిషన్లపై వాదిస్తున్న మాజీ సొలిసిటర్ జనరల్ - కాంగ్రెస్ ఎంపీ వివేక్ తన్‌ ఖాన్‌ ను తెలంగాణ సీఎల్ఫీ నేత కె.జానారెడ్డి - షబ్బీర్ అలీ ప్రభృతులు కలిసి ఈ అంశంపై చర్చించారు.ఈ ద‌ఫా కేసీఆర్ ఇరుక్కుపోవ‌డం ఖాయ‌మ‌ని భ‌రోసా వ్య‌క్తం చేస్తున్నారు. అనర్హత పిటిషన్లపై తాము విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని కాంగ్రెస్ నేత‌లు వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/