Begin typing your search above and press return to search.
సీఎం సొంత జిల్లాలో పోటీకి నై
By: Tupaki Desk | 6 Dec 2015 11:30 AM GMTసాధారణంగా ఎన్నికలంటే... రాజకీయ నాయకులు పార్టీల టికెట్ల కోసం పోడి పడుతారు. అవసరమైతే ఆయా పార్టీల పెద్దల ఆశీస్సుల కోసం పడరాని పాట్లు పడుతారు. పదేళ్లుగా అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సీఎం పీఠం అధిరోహిస్తారనుకున్న జానారెడ్డికి చెందిన సొంత జిల్లా నల్లగొండలో ఈ పరిస్థితి ఉంది.
స్థానిక సంస్థలకు సంబంధించిన శాసన మండలి ఎన్నికల్లో పోటి చేసేందుకు నామినేషన్ల ఘట్టం దగ్గరపడుతున్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అగ్రనేతలు ఇంకా నాన్చివేత ధోరణినే కొనసాగిస్తున్నారు. అధికార టీఆర్ ఎస్ క్యాంపుల్లో మునిగిపోతుంటే.. ప్రధాన ప్రతిపక్షం మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికి...ప్రజా ప్రతినిధులను కాపాడుకోవడంలో మాత్రం కాంగ్రెస్ నాయకులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ విసిరిన వలకు చాలా మంది చిక్కుకుని కారు ఎక్కారు. ఆ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులను గోడ దూకకుండా అడ్డు కట్ట వేయకుండా పట్టించుకోకుండా ఉన్నారు. తీరా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే సరికి ఓట్లు తక్కువగా ఉండటంతో పోటికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితి మెజార్టీగా ఉన్న జిల్లాలో కూడా ఉండటం కాంగ్రెస్ నేతలను విస్మయానికి గురి చేస్తోంది.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - సీఎల్పీ నేత జానారెడ్డి సొంత జిల్లా అయిన నల్లగొండ జిల్లాలోనే విచిత్రమైన పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు ముఖ్యనేతలతో పాటు ఇద్దరు ఎంపీ - ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ జిల్లాలో కాంగ్రెస్ గెలవడానికి సరిపోను ఓట్లు ఉన్నప్పటికి అభ్యర్థిని ప్రకటించే విషయంలో జాప్యం చేస్తున్నారు. మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటి చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే కోమటిరెడ్డిని జిల్లాలోని కొంత మంది సీనియర్లు వ్యతిరేకించడమే కాకుండా ఒకరిద్దరు పేర్లను కూడా తెరపైకి తెచ్చారు.
రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఒక్కో సీటు గెలచుకోవడానికి కాంగ్రెస్‌కు సరిపోను మెజార్టీ ఓటర్లు ఉన్నారు. అయితే ఇక్కడ పోటి చేయడానికి నాయకులు ముందుకు రావడంలేదు. ఈ జిల్లాలో మొదటి నుంచి మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుదీర్‌రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిల పేర్లు వినిపించాయి. సబితాఇంద్రారెడ్డి బరిలో ఉంటే గెలుపు ఖాయమనే ధీమాను కూడా కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేశారు. తీరా నామినేషన్ల సమయం వచ్చే సరికి సబితా పోటీకి ససేమిరా అనడంతో పార్టీ నాయకులకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది! ఇక పాలమూరు జిల్లాలో అంతా రెడీ అయినప్పటికీ పేరుప్రకటించలేకపోతున్నారు. ఖమ్మంలో మాత్రం సీపీఐ అభ్యర్థికి పువ్వాడ నాగేశ్వర్‌రావుకు మద్దతు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఇక మిగతా జిల్లాలలో మాత్రం పోటి చేయడానికే పార్టీ నాయకులు జంకుతున్నారు.
బద్ధశత్రువులైన టీడీపీ -కాంగ్రెస్ జతకట్టొచ్చన్న సమాచారం మేరకు గులాబీ దళపతి స్వయంగా అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ఇంకా నాన్చివేత దోరణిలో ఉంటే ఇంక ఆ పార్టీనీ నమ్ముకొని ఏం లాభం అని పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. గెలవక పోయినా పార్టీ ఉనికిని కాపాడుకోవడానికైనా పోటి చేస్తే బాగుంటుందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది.