Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీ ఇక గంద‌ర‌గోళ పెట్ట‌దంట‌

By:  Tupaki Desk   |   7 May 2017 7:12 AM GMT
కాంగ్రెస్ పార్టీ ఇక గంద‌ర‌గోళ పెట్ట‌దంట‌
X
తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఉన్న కీల‌కమైన విమ‌ర్శ ఏమిటంటే...పార్టీలో స‌భ్యులు ఎంద‌రో ఉన్నారో నాయ‌కులు అంద‌రు ఉన్నారనే కామెంట్ విష‌యంలో. ముఖ్య నేత‌లు ఎందరు ఉన్నారో..ముఖ్యమంత్రి అభ్య‌ర్థులు కూడా అంద‌రే ఉన్నార‌ని సెటైర్ వినిపిస్తూ ఉంటుంది. కీల‌క ప‌ద‌వుల్లో సీనియ‌ర్ల‌ను కూర్చోబెట్ట‌డం కూడా కాంగ్రెస్‌ పై ఈ విమ‌ర్శ‌లు వ‌చ్చేందుకు కార‌ణం.ప్రత్యర్థి పార్టీలు గెలుపు వైపు ఉరకలేస్తుంటే కాంగ్రెస్‌ లో మాత్రం అంత‌ర్గ‌త యుద్ధంతోనే సరిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌ లో జోడు గుర్రాల స్వారీకి స్వస్తిపలకాలన్న వాదనలు బలపడుతున్నాయి. ఈ మేర‌కు కొంద‌రు సీనియ‌ర్లు ప్ర‌య‌త్నాలు కూడా మెద‌లుపెట్ట‌డం గ‌మ‌నార్హం.

పీసీసీ అధ్య‌క్షుడు - సీఎల్పీ పదవులు వేరు వేరు నాయకుల ఆధీనంలో ఉండటం వల్ల గ్రూపులు ఎక్కువయ్యాయనేది కాంగ్రెస్‌ లోని మెజార్టీ నాయకుల అభిప్రాయం. ప్రజా సమస్యలపై నిర్ణయం తీసుకోవడానికి సైతం అందరు చర్చించుకొవాల్సిన పరిస్థితి ఉందన్నది వాదన. అందుకే ఈ గంద‌ర‌గోళం లేకుండా ఉండాంటే పీసీసీ-సీఎల్పీ సారథ్యం ఒక్కరికే ఇవ్వాలని సీఎల్పీనేత జానారెడ్డి కొత్త‌ వాదనను తెరపైకి తెచ్చారు. సీఎల్పీ పదవితోపాటు పీసీసీ పదవిని సైతం తనకే కట్టబెట్టాలనే ఒత్తిడిని అధిష్టానం పై తెస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలని, ఈ దిశ‌గా అధిష్టానం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కు కాంగ్రెస్ లో 2019 సీఎం అభ్య‌ర్థిపై క్లారిటీ లేదు. ఎన్నికల ముందు సీఎల్పీ, పీసీసీ పదవులు ఒక్కరికే కట్టబెట్టడం ద్వారా సీఎం అభ్యర్థి ఒక్కరే తెరపైకి కనిపిస్తారని జానా అధిష్టానం వద్ద వాదిస్తున్నారని స‌మాచారం. తనకు రెండు పదవులు అప్పగిస్తే తానే పార్టీని లీడ్ చేసి అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని ఇటీవల ఢిల్లీ టూర్ లో సైతం జానా అధిష్టాన పెద్దలకు చెప్పిన్నట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గం బలంగా ఉండడంతో రెండు పదవులు ఒకరికే కట్టబెట్టాలనే వాదనకి చాలా మంది మద్దతి ఇస్తార‌ని జానారెడ్డి భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/