Begin typing your search above and press return to search.

జానా జ్ఞాప‌క‌శ‌క్తికి ప‌రీక్ష‌..స‌హ‌నం కోల్పోయిన కాంగ్రెస్ నేత‌

By:  Tupaki Desk   |   21 Nov 2018 5:44 PM GMT
జానా జ్ఞాప‌క‌శ‌క్తికి ప‌రీక్ష‌..స‌హ‌నం కోల్పోయిన కాంగ్రెస్ నేత‌
X
కాంగ్రెస్‌ పార్టీ నాగార్జున సాగర్‌ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి - మాజీ సీఎల్పీ నేత జానారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆయ‌న నిర‌స‌న‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అనంత‌రం ఉగ్ర‌రూపం - అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించాల్సి వ‌చ్చింది. బుధవారం నాగార్జునసాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని తిరుమలగిరి మండలం గార్జునపేట తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా తండాలోని ప్రజలందరూ పార్టీలకతీతంగా నిలదీశారు. ‘35 ఏళ్లుగా మీరు ఏం చేశారు..అభివృద్ధిని - ప్రజలను పట్టించుకోని మీరు..ఇప్పుడు ఎన్నికలొచ్చాయని వస్తున్నారా?.. తలాపున కృష్ణమ్మ ఉన్నా తండాలో గుక్కెడు నీళ్లు లేవు..గిరిజన ఓట్లు అడిగే హక్కు మీరు కోల్పోయారు’ అని తండావాసులు జానారెడ్డిని నిలదీశారు. అయితే, ఈ సంద‌ర్భంగా జానారెడ్డి ఇచ్చిన స్పంద‌న‌కు ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా మద్దతుగా ఉండాలని జానారెడ్డి కోరగా తండాలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌మ‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌పై స్పందించాల‌ని డిమాండ్ చేశారు. వాహనాన్ని కదలనీయకపోవడంతో సహనం కోల్పోయిన జానారెడ్డి ‘ప్రచారంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు మాత్రమే ఉండాలి.. వేరేవాళ్లు ఉండడానికి వీలులేదు.. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతానంటే నేను అసలు లెక్కచేయను.. అభివృద్ధిపై తండావాసులు మాట్లాడడానికి అర్హులు కాదు.. మీరు ఓటేస్తే ఎంత..వేయకపోతే ఎంత..అభివృద్ధిపై అడిగిన ప్రజలను తోసేయండి’ అని గిరిజనులపై మండిపడ్డారు. జానారెడ్డి ప్రచార రథం వచ్చిన దగ్గర నుంచి ఒక అడుగు కూడా ముందక కదలకపోవడం గమనార్హం. ఈ సంద‌ర్బంగా ఓ వ్య‌క్తిపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ``ఓ వ్యక్తి ఏదో ప్రశ్నించగా... అరే.. పోవోయ్.. నువ్వు మొనగాడివి వేస్తే (ఓటు) ఎంత, వేయకుంటే ఎంత? మీకు ఎవ‌రితో ప‌ని చేసుకోవ‌డం న‌చ్చితే వారితోనే చేయించుకోండి`` అంటూ గుర్రుమ‌న్నారు.