Begin typing your search above and press return to search.
ఈ మాటలన్నీ జానా నోటి నుంచే వచ్చాయ్
By: Tupaki Desk | 26 Oct 2016 7:07 AM GMTఒక్కొక్కరి ఇమేజ్ ఒక్కోలా ఉంటుంది. అది సినిమా రంగమైనా.. రాజకీయ రంగమైనా. సినిమా రంగంలో ఎలా అయితే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి.. దాని నుంచి బయటకు వచ్చి భిన్నమైన సినిమాలు తీసేందుకు స్టార్ నటులు ఎలా అయితే ఇష్టపడరో.. సీనియర్ రాజకీయ నాయకుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. ఇమేజ్ వారిని ఇరికించేస్తుంది. నోటి నుంచి వచ్చే మాటలకు ఇమేజ్ స్పీడ్ బ్రేకర్లు పడుతుంటాయి. ఇప్పుడు నడుస్తున్న దూకుడు రాజకీయాల్లో ఎవరికి వారు.. ఎంత నోరు పారేసుకుంటే అంతగా మీడియాలో నానే పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా.. విలువలున్న రాజకీయాలు మాత్రమే చేస్తానంటూ మడి గట్టుకు కూర్చుంటూ.. తమ ప్రత్యర్థులకు ధీటైన సమాధానం ఇవ్వని సీనియర్ నేతలు కొందరు కనిపిస్తుంటారు. అలాంటి నేతల్లో ప్రముఖంగా చెప్పాల్సి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. పెద్దమనిషి తరహాలో వ్యవహరిస్తూ.. ఇప్పటి నేతల మాదిరి తాను ఇష్టారాజ్యంగా మాట్లాడలేనని చెబుతూనే.. సొంత పార్టీనే ఇరుకున పడేసే తీరు ఆయనకు మాత్రమే సొంతం. ఇలాంటి ఇమేజ్ ఉన్న జానా లాంటి నాయకులు తమ స్టైల్‌కి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యల మీద ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ బలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయంటూ టీఆర్ ఎస్ అధినేత చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన జానారెడ్డి.. ఒకవేళ అంత బలంగా పార్టీ ఉంటే.. ఇతర పార్టీలకు చెందిన నేతల్ని ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పాలంటూ తెలంగాణ అధికారపక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. సర్వేల పేరుతో లేని బలాన్ని ఉన్నట్లుగా చూపిస్తూ.. ప్రజల్ని మోసం చేయాలని కేసీఆర్ చూస్తున్నట్లుగా ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలోకి వెళ్లిన ఆయన.. కేసీఆర్ ను గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తలుచుకుంటే ఏపాటని.. ఆయన చేసిన ఉద్యమం పాకిస్థాన్‌తో చేసిన యుద్ధం కంటే ఎక్కువేమీ కాదంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారే తప్పించి.. కేసీఆర్ ఎంతమాత్రం కాదని తేల్చి చెప్పారు. పరుషంగా మాట్లాడటం తనకు రాదని చెప్పే జానా నోటి నుంచి ఈ తరహా మాటలు కాస్త కొత్తగా అనిపించట్లేదు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/