Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను ప‌బ్లిక్‌ గా టార్గెట్ చేసిన జానా

By:  Tupaki Desk   |   1 Jun 2016 10:39 AM GMT
కేసీఆర్‌ ను ప‌బ్లిక్‌ గా టార్గెట్ చేసిన జానా
X
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - సీఎల్పీ నేత కె జానారెడ్డి ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న పూర్తిచేసుకుంటున్న సంద‌ర్భంగా జానారెడ్డి బ‌హిరంగ లేఖ రాస్తూ ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌ట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు - రాజకీయ పార్టీలు ఏ ప్రయోజనాలు ఆశించి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాయో, ఆయా ప్రయోజనాలను నెరవేర్చడానికి అధికార పార్టీ కృషి చేయడం మ‌ర్చిపోవ‌ద్ద‌న్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలాగా ప్రజల, పార్టీల ఆత్మగౌరవం పెంపొందించేలా పాలన కొనసాగించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు సోనియాగాంధీ చూపిన తెగువ సాహసోపేతమైందన్నారు. అనేక దశాబ్ధాలుగా ఈ రాష్ట్ర ప్రజల ఆందోళన - ఆకాంక్షను గమనించి, నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సహయ - సహకారాలతో రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైన విషయం ప్రజలందరికి తెలిసిందే. అధికారంలో ఉన్న పార్టీ ఆనాడు చేసిన హామీలు నెరవేర్చి, ప్రజలు ఆశించిన విధంగా పరిపాలనను సాగిస్తూ రాష్ట్ర సమగ్ర మరియు సత్వర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరులందరికి శ్రద్దాంజలి ప్రకటించారు. ప్ర‌భుత్వ అడుగుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నామ‌ని స‌రైన సంద‌ర్భంలో ప్ర‌తిప‌క్షంగా త‌గు బాధ్య‌త‌ను ప్రోత్స‌హిస్తామ‌ని చెప్పారు. ప్ర‌జాస్వామ్యంలో అధికార ప‌క్షం ఎంత ముఖ్య‌మో ప్ర‌తిప‌క్షం కూడా అంతే ముఖ్య‌మన్నారు. అంద‌రినీ క‌లుపుకొని వెళ్లే విధానంపై దృష్టి పెట్టాల‌ని కోరారు. స‌హ‌జంగా సౌమ్యంగా ఉండే జానారెడ్డి ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా బ‌హిరంగ లేఖ రాయ‌డం అంటే స‌ర్కారు త‌న దృక్ప‌థాన్ని మార్చుకున్న‌ట్లేన‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.