Begin typing your search above and press return to search.

జానా వులే... నెర'జాన'వులే..

By:  Tupaki Desk   |   10 Oct 2015 9:16 AM GMT
జానా వులే... నెరజానవులే..
X
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేసిన పని ఆ పార్టీ నేతలకు - కార్యకర్తలకు మంటపుట్టిస్తోంది. తెలంగాణ సర్కార్‌ రైతుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌ తో విపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు చేపట్టిన బంద్‌ లో కాంగ్రెస్‌ సీఎల్పీ నేత జానారెడ్డి పాల్గొనలేదు... పోన్లే అనుకున్నారు అంతా, కానీ, అంతలో ఆయన ఈ కార్యక్రమంలో అరెస్టైన వారిని పరామర్శించడానికి వచ్చి పుండు మీద కారం జల్లారు.

బంద్‌ లో భాగంగా తెల్లవారు జాము నుంచే విపక్షాల నేతలు ఆందోళనల్లో పాల్గొని, అరెస్టులు కూడా అయ్యారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి మాత్రం బంద్‌ లో ఎక్కడా కనిపించలేదు. దీంతో కాంగ్రెస్ తో పాటు మిగతా ప్రతిపక్షాలూ చర్చించుకున్నాయి. అన్నిప్ర‌తిప‌క్షాలూ క‌లిసొచ్చిన‌, క‌దిలొచ్చిన కార్య‌క్ర‌మానికి త‌మ పార్టీ సీనియ‌ర్ లీడ‌రే రాక‌పోవ‌డంతో కాంగ్రెస్‌ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. అయితే.. స‌ర్లే అని వారంతా స‌రిపెట్టుకున్న స‌మ‌యంలో వారి కోపం మ‌రింత రెట్టింప‌య్యేలా చేశారు జానా... అరెస్ట‌యి గోషామహల్ పోలీస్ స్టేష‌న్ లో ఉన్న నేత‌ల వ‌ద్ద‌కొచ్చి బాగున్నారా అంటూ జానా ప‌రామ‌ర్శించారు. దీంతో వారి కోపం న‌షాళానికి అంటింద‌ట‌. అనారోగ్యం కారణంగానే తాను బంద్‌లో పాల్గొనలేకపోయానని చెప్పిన జానా మాట‌ల‌ను వారెవ‌రూ న‌మ్మ‌డం లేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి టీఆరెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జానా లేని పెద్ద‌రికం తెచ్చుకుని టీఆరెస్ తో అంట‌కాగుతున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. గ‌త సంఘ‌ట‌ల‌ను వారు గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో సొంత పార్టీ నేత‌ల‌తోనే జానా క్ష‌మాప‌ణ‌లు చెప్పించార‌ని.... టీఆరెస్ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న కావాల‌నే ఈ కార్య‌క్ర‌మానికి రాలేదంటున్నారు. ఆందోళ‌న‌లో పాల్గొన‌డానికి ఆరోగ్యం బాగులేక‌పోతే త‌మ‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఎలా వ‌చ్చార‌ని వారంతా ప్ర‌శ్నిస్తున్నారు.