Begin typing your search above and press return to search.
కోదండం కులాన్ని కేసీఆర్ చెప్పారా?
By: Tupaki Desk | 30 Dec 2016 4:53 AM GMTకొందరిని కులం కోణంలో అస్సలు చూడలం. కులం చట్రంలో పరిమితం చేయటాన్ని మనసు అస్సలు ఊరుకోదు. అలాంటి వారిలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ గా.. తెలంగాణ ఉద్యమ నేతగా సుపరిచితమైన కోదండరాం ఒకరిగా చెప్పాలి. కులం మకిలి తన దగ్గరకు రానివ్వకుండా ఉండే ఆయన.. మిగిలిన వారి మాదిరి తన పేరు చివరన కులం పేరును పెట్టుకోవటానికి అస్సలు ఇష్టపడరు.
ఉద్యమ వేత్తగా.. వామపక్ష భావజాలం ఉన్న నేతగా ఆయన కులాలకు చాలా దూరంగా ఉంటారు. కులంపేరుతో ఆయనకు దగ్గర కావటానికి ఎవరైనా ప్రయతిస్తే.. ఆయన దూరంగా ఉండిపోతారు. అలాంటి కోదండరాం ఏ కులస్తుడు? అన్న డౌట్ ఉద్యమ సమయంలో కొందరి నోట వచ్చింది. అయిన్పటికీ.. ఆయన కులం ఏమిటన్నది ఎవరూ పట్టించుకున్నది లేదు.
అలాంటిది కోదండం మాష్టారి కులం మీద ఈ మధ్యన జరుగుతున్న చర్చను తనదైన శైలిలో బయటపెట్టారు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న తనకు సైతం కోదండరాం కులం తెలియదని.. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చెబితేనే ఆయన రెడ్డి అన్న విషయం తెలిసిందని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఒక సామాజిక ఉద్యమకారుడిగానే కోదండరాం తనకు తెలుసని.. అలాంటి ఆయనకు కులాన్ని అపాదించటం సరికాదన్నారు. భూనిర్వాసితుల కోసం కోదండం చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని.. ఆయనతో ప్రబుత్వం వెంటనే చర్చలు జరపాలంటూ జానారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కులాన్ని తన దగ్గరకు రానివ్వని కోదండం కులాన్ని కేసీఆర్ లాంటి అధినేత ప్రస్తావించటంలో అంత్యరం ఏమిటంటారు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/