Begin typing your search above and press return to search.
కొత్త ఎజెండాతో వస్తున్న జానారెడ్డి
By: Tupaki Desk | 25 Dec 2016 7:28 AM GMTతెలంగాణలో ప్రధానప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ అధికార టీఆర్ ఎస్ పై ఘాటుగా స్పందించడంలేదనే విమర్శలు ఎదుర్కుంటున్న సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తన రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే విధంగా పలు అంశాలు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇదే రీతిలో తాజాగా ఆయన జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదనే కొత్త ఎజెండాతో ముందుకు వస్తున్నారు. మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరుగుతున్న రిలే నిరాహారదీక్షలను సందర్శించిన జానారెడ్డి ఈ సందర్భంగా అన్ని అర్హతలు - సౌకర్యాలున్న మిర్యాలగూడను జిల్లా చేయాలని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీనిచ్చారు
జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని, ప్రజలు - రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని జానారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని జిల్లాలు ఏర్పాటు చేశారని, దీంతో ఊహించని విధంగా రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా విభజించారన్నారు. వాస్తవానికి అర్హత లేని ప్రాంతాలను జిల్లాలను చేసి అర్హత ఉన్న ప్రాంతాలను విస్మరించారని జానా రెడ్డి దుయ్యబట్టారు. మిర్యాలగూడ విద్య - వైద్యం - వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ది చెందిందన్నారు. 50 ఏళ్ల కిందటే జిల్లాకు అర్హత ఉందని గుర్తించి అన్ని ప్రధాన శాఖల కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రానికే అత్యధిక ఆదాయం కల్పిస్తున్న ప్రాంతంగా గుర్తింపు పొందిందన్నారు. ఇలా వాస్తవానికి జిల్లాల ఏర్పాటులో మిర్యాలగూడకు మొదటి స్థానం ఉండాలన్నారు. కానీ మిర్యాలగూడను విస్మరించడం దారుణమని జానారెడ్డి వ్యాఖ్యానించారు.
నాగార్జునసాగర్ - మిర్యాలగూడ - హుజూర్ నగర్ నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ప్రకటించి, హుజూర్ నగర్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చా లని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయాలపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని దీక్షలో ఉన్న వారికి జానా హామీ ఇచ్చారు. అవసరమైతే ఇతర విపక్షాలను కలుపుకొని జిల్లా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. సాగు నీటి విడుదల విషయంలో మంత్రులకు అవగాహన లేదని, అందుకే యాసంగి పంటకు నీటి విడుదలలో భిన్న ప్రకటనలు చేసి రైతులను గందరగోళానికి గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా సాధించేంత వరకూ పోరాటాలు సాగిస్తామన్నారు. మరిన్ని బలమైన ఉద్యమాలు చేసి ప్రభుత్వ మెడలు వంచైనా జిల్లాను సాధించుకుంటామన్నారు. దీనికి అన్ని రంగాల ప్రజలు సహకరించాలని, అన్ని పక్షాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/