Begin typing your search above and press return to search.
తెలంగాణ పెద్దన్న చంద్రబాబును పొగిడేశాడు
By: Tupaki Desk | 17 Oct 2015 10:43 AM GMTఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును కాంగ్రెస్ సీనియర్ లీడర్, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేత అయిన జానారెడ్డి ఆకాశానికెత్తేశారు. తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీలకూ పెద్దన్నలా వ్యవహరిస్తూ తెలంగాణ పెద్దన్నగా పేరు తెచ్చుకుంటున్న జానారెడ్డి ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు చేస్తున్న కృషి అమోఘం అన్నారు. అమరావతి నిర్మాణానికి చంద్రబాబు బాగా శ్రమిస్తున్నారని ఈ మాజీ సహచరుడు ముఖ్యమంత్రికి కితాబిచ్చారు.
శనివారం ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ లు జానారెడ్డిని కలిసి అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించారు. ఆ సందర్భంలో జానారెడ్డి చంద్రబాబు పట్టుదల, అమరావతి కోసం ఆయన చేస్తున్న కృషి బ్రహ్మాండంగా ఉందంటూ పొగిడారు. కాగా జానారెడ్డి కూడా ఒకప్పుడు టీడీపీలో ఉన్న నేతే... ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆయన పనిచేశారు.
మరోవైపు జానాను ఆహ్వానించిన మంత్రులు అయ్యన్న - కామినేనిలు కూడా జానా తీరును మెచ్చుకున్నారు. తాము రెండు రోజులుగా తిరుగుతుంటే జగన్ కలవకుండా తప్పించుకుంటున్నారని... తెలంగాణ శాసనసభలో విపక్ష నేత కె.జానారెడ్డి మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించారని... అమరావతి రాజదాని శంకుస్థాపనకు వస్తానని చెప్పారని అన్నారు. అంతేకాదు... ఎపి శాసనసభలో విపక్ష నేత అయిన జగన్ మాత్రం శంకుస్థాపనకు రానంటున్నారని ఎపి మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.జగన్ ఇంత మూర్ఖుడు అని అనుకోలేదని ఆయన మండిపడ్డారు.రాజదాని శంకుస్థాపనకు రాకపోతే జగన్ చరిత్రహీనుడు అవుతారని అయ్యన్న పాత్రుడు ద్వజమెత్తారు.జానారెడ్డిని చూసైనా జగన్ పద్దతి నేర్చుకోవాలని ఆయన సూచించారు.కాగా మరో మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ తాము ఇంతవరకు ఏభై మందిని ఆహ్వానించగా అందరూ వస్తామన్నారని.. జగన్ మాత్రం అసలు కలవకుండా ఇబ్బంది పెడుతున్నాడని అన్నారు.