Begin typing your search above and press return to search.
ఈ పొగడటమేమిటి జానాసాబ్?
By: Tupaki Desk | 29 Jan 2016 6:01 AM GMTదేనికైనా సమయం.. సందర్భం ఉండాలి. ఈ రెండు లేకుండా ఎంత గొప్ప పని చేసినా ప్రయోజనం ఉండదు. ఇలాంటి విషయాలు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డికి ఎవరో చెప్పాల్సి రావటం ఇప్పుడు పెద్ద విషయంగా మారింది. ఎంత మంచిపనులు చేసినా ప్రత్యర్థుల్ని కీర్తించేంత పెద్దమనసు రాజకీయాల్లో ఉండవు. విడి రోజుల్లో అలాంటివి అరకొర చోటు చేసుకున్నా.. ఎన్నికల వేళ అలాంటి అవకాశం అర శాతం కూడా ఉండదు.
కానీ.. ఇదెక్కడి చోద్యం అన్న చందంగా తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గురువారం ఒక్కరోజులోనే రెండు అంశాలకు సంబంధించిన ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నారు. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ విషయంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై సానుకూలంగా స్పందించటంతో పాటు.. రూ.5 భోజనం పథకాన్ని మెచ్చుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేసిన రూ.5 భోజనం నాణ్యత ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు గురువారం సీఎల్పీ సిబ్బంది చేత ప్రత్యేకంగా తెప్పించుకున్న జానాసాబ్ దీని నాణ్యత.. రుచి ఓకే అని చెప్పటం... పథకం బాగా అమలు అవుతుందని పేర్కొనటంపై కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ పథకం కాంగ్రెస్ హయాంలో షురూ అయినా.. ఇది తమ పథకంగా టీఆర్ఎస్ సర్కారు చెప్పుకొంటోంది. కనీసం ఈ విషయాన్ని అయినా జానాసాబ్ చెప్పి ఉంటే బాగుండేదని.. అలాంటి ప్రస్తావన ఏమీ లేకుండా రూ.5భోజనం తినేసి బాగుందని తేల్చేయటం పార్టీకి దెబ్బగా మారుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా.. ఎన్నికల వేళ జానాసాబ్ వైఖరి తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.