Begin typing your search above and press return to search.

తమ్ముళ్లపై గట్టిగానే ఉన్నారే..

By:  Tupaki Desk   |   20 March 2015 10:07 AM GMT
తమ్ముళ్లపై గట్టిగానే ఉన్నారే..
X
తెలంగాణ తెలుగు తమ్ముళ్లపై.. తెలంగాణ అధికారపక్షం గట్టిగానే ఉంది. జాతీయ గీతాన్ని అవమానించారన్న అంశంపై తెలుగుదేశం సభ్యులను బడ్జెట్‌ సెషన్‌ వరకూ సస్పెండ్‌ చేసేయటంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది.

మజ్లిస్‌ మినహా మిగిలినపార్టీ నేతలంతా తమ్ముళ్లపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. ఏపీ అసెంబ్లీలో ఇంతకు మించి రచ్చ జరిగినా మూడు రోజులు మాత్రమే సస్పెండ్‌ చేశారని సీఎల్పీ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌ గా తెలంగాణ హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. మహారాష్ట్ర అసెంబ్లీలో సభ్యలు తీరు బాగోలేక రెండేళ్లు సస్పెన్షన్‌ విధించారన్నారు.

తెలంగాణ తమ్ముళ్ల వైఖరి అసెంబ్లీలోనే కాదు.. బయట కూడా బాగోలేదంటూ.. తమ వైఖరి మార్చుకునేది లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. జానారెడ్డితోపాటు.. బీజేపీ.. కమ్యూనిస్టులు తమ్ముళ్ల మీద వేటు తీసేయాలని కోరారు. దీనికి సమాధానం ఇచ్చిన తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌.. సంకుచిత మనస్తత్వంతోనే జాతీయగీతాన్ని అవమానించారంటూ వ్యాఖ్యానించారు.అయితే.. ఈ అంశానికి సంబంధించిన నిర్ణయం స్పీకర్‌ తీసుకోవాలని.. తమ చేతిలో ఏమీ లేదన్నారు. దీనికి బదులుగా స్పీకర్‌ స్పందిస్తూ.. అన్ని పార్టీల అభిప్రాయాల్ని తీసుకొని నిర్ణయం చెబుతానన్నారు. వ్యవహారం చూస్తుంటే.. తమ్ముళ్లపై తెలంగాణ అధికారపక్షం కరుకుగా ఉండే సూచనలే బలంగా కనిపిస్తున్నాయి.