Begin typing your search above and press return to search.

జానారెడ్డికి సీఎం పదవిచ్చిన తీసుకోరట

By:  Tupaki Desk   |   21 May 2016 6:29 AM GMT
జానారెడ్డికి సీఎం పదవిచ్చిన తీసుకోరట
X
తెలుగు రాష్ర్టాల రాజకీయాల్లో పార్టీల ఫిరాయింపులు అత్యంతసాధారణ రాజకీయ చర్యగా మారిపోయిన సమయమిది.బద్దశత్రువులు అనుకునే నాయకులు కూడా ప్రజాసంక్షేమం పేరుచెపుతూ కండువాలు మార్చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సీనియర్లు కూడా మినహాయింపు కాదు. కొద్దికాలంగా సీఎల్పీనాయకుడు - సీనియర్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డిపై టీఆర్ ఎస్ పక్షపాతి అనే విమర్శలు అనేక దఫాలుగా వచ్చిన సంగతితెలిసిందే. వాటిని కొట్టిపారేసిన జానారెడ్డి తాజాగా ఆశ్చర్యకరమైన ప్రకటన ఒకటి చేశారు.

పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పరాభవాన్ని తనదైన శైలిలో విశ్లేషించిన జానారెడ్డి టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఇంకా భ్రమలున్నాయని అందుకే వారు గెలిపిస్తున్నారని చెప్పారు. ఈఉప ఎన్నికలో ఓటమి నిరాశ కలిగించినప్పటికీ మనోధైర్యంతో ముందుకుసాగాలని అన్నారు. అదే క్రమంలో ఉప ఎన్నికల్లో గెలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఒకింత వేదాంతంలోకి వెళ్లిన జానారెడ్డి ఎన్నికలు చాలా ఖరీదు అయిపోయాయని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని పేర్కొంటూ ఇపుడు తనకు సీఎం పదవి ఇచ్చినా తీసుకోనని ప్రకటించారు.

తన సీనియారిటీతో పొంతన లేకుండా మాట్లాడగలరనే పేరున్నజానారెడ్డి సీఎం పదవి వద్దని చెప్పడంపై పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జానారెడ్డికి ఇప్పటికిపుడు సీఎం పదవిఎవరిస్తారనే చర్చ తెరమీదకు వస్తోంది. కాంగ్రెస్ ఎలాగూ అధికారంలో లేదు కాబట్టి పదవి బదలాయింపు ఉండదు. ఇక అధికారపార్టీ అయిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అంత పెద్దపదవిని జానారెడ్డికి ఆఫర్ చేస్తారా అంటే అదీ అనుమానమే.అయినప్పటికీ జానారెడ్డి సీఎం పదవి గురించి ఎందుకిలా స్పందించారో ఆయనకే తెలియాలని చెప్తున్నారు.