Begin typing your search above and press return to search.

ప‌రువు హ‌త్య‌...సీన్లోకి జానారెడ్డి ఎంట్రీ

By:  Tupaki Desk   |   17 Sep 2018 3:14 PM GMT
ప‌రువు హ‌త్య‌...సీన్లోకి జానారెడ్డి ఎంట్రీ
X
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జ‌రిగిన‌ పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రేమించి పెల్లి చేసుకున్న ప్ర‌ణ‌య్ అమృత దంపతుల‌పై దాడి జ‌రిగింది. గర్భవతి అయిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి వస్తున్న ఓ వ్యక్తి ప్రణయ్‌పై కత్తులతో దాడి చేశాడు. ప్రణయ్ మామ మారుతీరావు ఈ హత్యలో కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. ప్రేమ వివాహే కారణమని పోలీసులు నిర్దారించారు. హత్య నేపథ్యంలో మిర్యాలగూడ బంద్ కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న‌పై సీఎల్పీ నేత జ‌నారెడ్డి జోక్యం చేసుకున్నారు.

మిర్యాల‌గూడ‌లోని ప్రణయ్‌ ఇంటికి వచ్చిన సీఎల్పీ నేత జానారెడ్డి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రణయ్‌ భార్య అమృతవర్షిణితో మాట్లాడి జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘ‌ట‌న ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి హత్యలు అత్యంత ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. ప్రణయ్‌ ను హత్య చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రణయ్‌ భార్య అమృతకి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రణయ్ హత్యలో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ కరీంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. కాగా, ప్రణయ్ భార్య అమృతను - అతని తల్లిదండ్రులను ప్రముఖ ప్రజా గాయకురాలు విమలక్క సోమవారం పరామర్శించారు.

మ‌రోవైపు మృతుడు ప్రణయ్ భార్య అమృత న్యాయం కోసం పోరాటాన్ని ప్రారంభించారు. ప్రణయ్‌ ని చంపిన వాళ్లను శిక్షించటానికి - పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేస్తానని.. ముఖ్యంగా ప్రణయ్‌ ఆశయమైన క్యాస్టిజంపై పోరాటం చేస్తానని ఆమె అన్నారు. తాను మరో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని, పుట్టింటికి కూడా వెళ్లేది లేదని అమృత ఇప్పటికే చెప్పింది. ప్రణయ్ హత్య విషయంలో సామాజిక న్యాయం కోసం సోషల్ మీడియా వేదికగా అమృత పోరాటం మొదలుపెట్టారు. ‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ పేరిట ఫేస్‌ బుక్‌ పేజీ క్రియేట్‌ చేశారు. ఫేస్ బుక్ పేజీ ప్రారంభించిన తొలి ఐదు గంటల్లోనే పదివేల మంది పేజీని లైక్ చేశారు. ప్రణయ్ విషయంలో న్యాయం జరగాలంటూ కామెంట్ పోస్ట్ చేశారు.