Begin typing your search above and press return to search.
స్థానిక ఎన్నిక...జానా, హరీశ్ కు షాక్
By: Tupaki Desk | 13 Jan 2018 10:40 AM GMTతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎంపీటీసీల స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి కొంత హ్యాపీ..కొంత బీపీ మిగిలింది. మెజార్టీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయదుందిబి మోగించింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ ఆయన మేనల్లుడు హరీశ్ రావు ఇలాకా అయిన సిద్ధిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జిల్లాలోని చేర్యాలలో టీఆర్ ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి 94 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ పరిణామంతో టీఆర్ ఎస్ వర్గాలు ఖంగుతిన్నాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు - సీఎల్పీ నేత జానారెడ్డికి ఇదే అనుభవం ఎదురైంది.
సీఎల్పీ నేత జానారెడ్డికి తన సొంత నియోజకవర్గంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిడమనూరు ఎర్రబెల్లి స్థానంలో మొత్తం 2724 ఓట్లకు 2304 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ ఎస్ అభ్యర్థి మన్నెం వెంకన్న యాదవ్ 1331 ఓట్లు సాధించి 563 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సిద్దనూరు వెంకటేశ్వర్లు 768 ఓట్లు దక్కించుకున్నారు. టీడీపీ 147 - నోటాకు 58 ఓట్లు వచ్చాయి.నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం - నిడమనూరు మండలం ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాల్లో అధికార పార్టీ టీఆర్ ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కిష్టాపురంలో 2152 ఓట్లకు 1233 ఓట్లు దక్కించుకున్న టీఆర్ ఎస్ అభ్యర్థి కదెరె లింగయ్య 508 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మునుకుంట్ల గోపాల్ గౌడ్ కు 725 ఓట్లు వచ్చాయి. బీజేపీ 131 - టీడీపీ 29 - నోటాకు 34 ఓట్లు దక్కాయి.
--రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి మల్లేశ్ గౌడ్ 561 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నాగేందర్ పై గెలిచారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి ఎంపీటీసీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ ఎస్ అభ్యర్థి లింగమ్మకు 747 ఓట్లు పోలయ్యాయి. దీంతో లింగమ్మ సమీప ప్రత్యర్థిపై 451 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
--మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలంలోని కన్మనూర్ ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గోవిందమ్మ 382 ఓట్లతో విజయం సాధించింది.
-కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండల ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి పసునూరి స్వప్న 450 ఓట్ల మెజారిటీతో గెలిచింది. వనపర్తి జిల్లా గోపాల్ దిన్నె ఎంపీటీసీ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై 491 ఓట్ల తేడాతో టీఆర్ ఎస్ అభ్యర్థి గెలుపొందారు.
-భద్రాచలం ఎంపీటీసీ ఏడో స్థానానికి ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయం సాధించింది. సీపీఎం అభ్యర్థిపై 74 ఓట్ల తేడాతో టీఆర్ ఎస్ అభ్యర్థి గెలుపొందారు.
-ఖమ్మం జిల్లా జక్కేపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయం సాధించింది. సీపీఎం అభ్యర్థిపై 228 ఓట్ల తేడాతో టీఆర్ ఎస్ అభ్యర్థి గెలుపొందారు.