Begin typing your search above and press return to search.

రెడ్డి గారి పదవి పోతే . వాళ్ల అబ్బాయి తెరాసలోకి!

By:  Tupaki Desk   |   15 July 2015 5:30 PM GMT
రెడ్డి గారి  పదవి పోతే . వాళ్ల అబ్బాయి తెరాసలోకి!
X
జానారెడ్డి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఆయనను సీఎల్పీ నేతగా ఒప్పుకొనే వారు తక్కువమందే. అధికారికంగా ఆయన నేత అయితే అయ్యుండొచ్చు కానీ.. తమకు మాత్రం ఆయన నాయకుడు కాడన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఆయనను తప్పించాలని డిమాండ్ చేసే వాళ్లకూ లోటు లేదు. ఉన్నది కొంతమంది ఎమ్మెల్యేలే అయినా.. వారిలో సగం మందికి సీఎల్పీ అధ్యక్షుడిపై విశ్వాసం లేదు.

ఇలాంటి నేపథ్యంలో అధిష్టానం కూడా జానారెడ్డి విషయంలో చాలా అసంతృప్తితోనే ఉందట. ఆయనది మెతక వైఖరి అని.. తెరాస మీద పోరాడే తత్వం కాదని.. ఆయనను తప్పిస్తేనే మంచిదన్నట్టుగా భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్ ను పరిగణనలోకి తీసుకొని.. జానాను సీఎల్పీ అధ్యక్ష పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో జానారెడ్డి వైపు నుంచి కూడా ప్రతి చర్యలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఒకవేళ తనను సీఎల్పీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే.. తన తనయుడిని పార్టీ దాటించాలనే భావనతో ఉన్నాడట జానారెడ్డి. తన విలువ అధిష్టానం అర్థం చేసుకోవాలని.. పదవిని రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నట్టుగా తనకే వదిలిపెట్టాలనేది జానారెడ్డి భావన. అందుకు అధిష్టానం సహకరించకపోతే తను కాకపోయినా.. తన తనయుడు పార్టీ మారతాడనే పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నాడట ఆయన. ఈ వయసులో జానారెడ్డి పార్టీ మారినా అది చండాలంగా ఉంటుంది. సీఎల్పీ అధ్యక్ష హోదా పోయిన తర్వాత పార్టీ మారడం అనేది అత్యంత అవమానకరమైన అంశం అవుతుంది. అందుకే.. జానా రాజకీయం చేస్తూ.. తన పదవి పోతే తన తనయుడిని టీఆర్ఎస్ లోకి చేర్చడం ద్వారా అధిష్టానంపై నిరసన భావాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నాడట. మరి ఇలాంటి నేతలున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ కోలుకొంటుందంటే.. నమ్మకం కుదిరేదెలా?!