Begin typing your search above and press return to search.
జానారెడ్డి ప్లాను అదేనా?
By: Tupaki Desk | 15 Dec 2015 11:30 AM GMTకాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి టీఆర్ ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా...? అందులో భాగంగానే తన అనుచరులను గులాబీ గూటికి చేరుస్తున్నారా? జానారెడ్డి, కేసీఆర్ లు కలిపి వ్యూహాత్మకంగా సాగుతున్నారా... ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విత్ డ్రా కావడం వెనుకా ఇలాంటి కారణాలే ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ప్రజలకు వచ్చినవే కాదు.. కాంగ్రెస్ అధిష్ఠానికీ ఇవే డౌట్లు వస్తున్నాయట. తాజాగా టీ కాంగ్రెస్ నేతలను అధిష్ఠానం పిలిచి క్లాసు తీసుకున్నప్పుడు కూడా జానారెడ్డికి స్పెషల్ క్లాసు తీసుకున్నారట. దీంతో ఇంకెందుకు ముసుగులో గుద్దులాట అనుకుంటున్న ఆయన పార్టీని వీడడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
జానా గతంలో కూడా టీఆర్ ఎస్ లో చేరేందుకు తయారయ్యరన్న కథనాలు వచ్చాయి. కానీ, వెనక్కి తగ్గిన జానారెడ్డి.. ఆ తర్వాత కొన్నాళ్లపాటు కామ్ గా ఉన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు - విమర్శలు ఎక్కువగా చెయ్యలేదు. అడపాదడపా విమర్శలు చేసినా అవి తప్పని పరిస్థితుల్లో అనాల్సి వచ్చినవే అన్నది ఆయన అనుచరుల వాదన. తాజాగా జానాతో కలిసి సుదీర్ఘకాలం పనిచేసిన ముగ్గురు నల్గొండ జిల్లా నేతలు టీఆర్ ఎస్ లో చేరారు. ఆప్కాబ్ మాజీ చైర్మన్ విజయేందర్ రెడ్డి - కోటిరెడ్డి - రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ధన మల్లయ్య.. ముగ్గురూ గులాబీ గూటికి చేరారు. ఐతే దీని వెనుక జానా వ్యూహమే ఉంటుందన్నది తాజా చర్చ. వీళ్లంతా జానారెడ్డిని కాదని మరోచోటకు వెళ్లేవారు కాదన్నది వారి సన్నిహితుల వాదన. తప్పకుండా జానారెడ్డి సూచనతోనే ఇలా చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది. బయటకు మాట్లాడకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల అదను చూసి వీరిని పార్టీ ఫిరాయించేలా చేశారని జానాపై మండిపడుతున్న కాంగ్రెస్ నేతలూ ఉన్నారు. దీంతో జానా కూడా త్వరలో కారెక్కుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే... జానారెడ్డిని తీసుకుంటే కేసీఆర్ ఆయన ఇంతకాలం అందించిన సహకారం... ఆయన సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. వీటన్నిటిపై ముందే ఒప్పందాలు కుదుర్చుకునే జానా టీఆరెస్ లోకి అడుగుపెడతారని సమాచారం.