Begin typing your search above and press return to search.
కొత్త కోణం: పాతకు కొత్త నోట్లు ఇస్తున్న జనసేన
By: Tupaki Desk | 27 Nov 2016 10:17 AM GMTదేశంలో ఇప్పటివరకే మరే పార్టీకి రాని సరికొత్త ఆలోచన జనసేన చేసింది. నోట్ల రద్దు నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో.. తదనంతర పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాల్సి ఉందని.. కానీ.. ఆ విషయంలో కేంద్రం విఫలమైందని పవన్ ఇప్పటికే పలుమార్లు చెప్పటం తెలిసిందే. తాజాగా.. రద్దు నిర్ణయంతో ప్రజలు పడుతున్న కష్టాలకు నిరసనగా ఎంపీలు ఏటీఎం సెంటర్లకు వచ్చి సంఘీభావంగా క్యూలో నిలచుకోవాలంటూ పవన్ కోరారు.
ఇదిలా ఉంటే.. తాజాగా జనసేన కార్యకర్తలు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో మరే రాజకీయ పార్టీ చేయని రీతిలో ఆ పార్టీ కార్యకర్తలు చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నోట్ల రద్దు నేపథ్యంలో కరెన్సీ నోట్ల కష్టాలతో సామాన్యులు కిందామీదా పడుతున్న పరిస్థితి. ఇలాంటి ఇబ్బందిని కొంత మేర అయినా అధిగమించేందుకు వీలుగా.. జనసేన కార్యకర్తలు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో రోగుల నుంచి.. వారి బంధువుల నుంచి పాత నోట్లను సేకరించారు.
గడిచిన రెండు రోజులుగా బ్యాంకులు పని చేయకపోవటంతో తీవ్రంగా అవస్థలుపడుతున్న వారికి చేయూతను ఇచ్చేందుకు వీలుగా.. రోగులు.. వారి బంధువుల వద్ద ఉన్న పాత నోట్లను సేకరించి.. ఆస్థానంలో కొత్త నోట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని కేవలం మానవతా దృక్ఫదంతోనే నిర్వహిస్తున్నట్లుగా జనసేన కార్యకర్తలు చెప్పినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా రోగులకు పండ్లు పంచి పెట్టినట్లుగా తెలుస్తోంది. మానవతా దృక్ఫదంతో చేసే ఇలాంటి కార్యక్రమాలకు చట్టం ఎలా స్పందిస్తుందన్నదే అసలు ప్రశ్న.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/