Begin typing your search above and press return to search.
ఉన్నవి రెండే పార్టీలు..ఏదో ఒకటి ఎంచుకోవాలి - పవన్
By: Tupaki Desk | 14 Nov 2018 12:26 PM GMTతూర్పుగోదావరి యాత్రలో భాగంగా పవన్ కు ఒక చిక్కు ప్రశ్న ఎదురైంది. దానికి పవన్ ఇచ్చిన సమాధానం జనసైనికులకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టడమే కాదు... కొత్త రాజకీయ అనుమానాలకు దారితీసేలా ఉంది. ఇంతకీ పవన్ ఏమన్నాడో చూడండి.
కాకినాడలో పవన్ కళ్యాణ్ తనను అభిమానించే కొందరు ముస్లిం గ్రూపుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారితో పవన్ కాసేపు సరదాగా మాట్లాడుతూ గడిపారు. మీ మనసులో మాటలు పంచుకోండి అంటూ చెప్పారు. ఈ సందర్భంగా జవహర్ అలీ అనే న్యాయవాది పవన్ కు సూటి ప్రశ్న వేశారు. అతను ఏమడిగారంటే... ‘దేశంలో ద్వితీయశ్రేణి పౌరులుగా అభద్రతాభావంతో జీవిస్తున్నాం. ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్న బీజేపీతో జనసేన బంధంపై ఒక ప్రకటన చేయాలి’ అని అడిగారు. దానికి పవన్ స్పందించారు.
*బీజేపీ హిందువుల పార్టీ కాదు. ఒక రాజకీయ పార్టీ అంటూ సమర్థించారు పవన్. బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు... ఆ పార్టీ సంఘ్ తో ఉంటుంది కదా ఎలా ఇస్తావు అన్నారు. అలా లెక్కలు వేసుకుంటే ఈ దేశంలో ఎవ్వరితోనూ దోస్తీ చేయలేం అని సమర్థించుకున్నారు. జాతీయ పార్టీలు రెండే ఉన్నాయి. కాంగ్రెస్...బీజేపీ... ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చింది అన్నారు.
అయితే, వైసీపీ చాలారోజులుగా పవన్ బీజేపీలో చేతిలో బొమ్మ అని ఆరోపిస్తూ వచ్చిన మాటకు మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి పవన్ వ్యాఖ్యల తర్వాత. జనసేనను బీజేపీలో విలీనం చేస్తే మీరు అనాలి. చేయలేదు కదా అన్నారు. అంటే...పవన్ చేసి ఈ వ్యాఖ్యలన్నీ కలిపి చూస్తే... ఏదో ఒక పార్టీతో కలవక తప్పదు అనుకునే పవన్ మళ్లీ ఏదో ఒకపార్టీతో 2019లో కూడా కలుస్తారా ఏంటి?